I Nobody Review: బ్యాంక్ హెయిస్ట్ థ్రిల్లర్ హిట్ అందుకుందా?
ప్రపంచం ఎప్పుడూ మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది. అదేంటంటే.. ఈ విశాల ప్రపంచంలో మనం ఒక "ఎవరూ కాదు" (Nobody) అని. పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి ప్రధాన పాత్రల్లో నటించిన 'ఐ, నోబడీ' కూడా ఇదే భావాన్ని తీసుకుని, దానికంటే ముందుకు వెళ్లి ఒక కీలకమైన ప్రశ్నను మనపై సంధింస్తుంది.
చిత్రం: ఐ నోబడి
విడుదల: 10-07-2026
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు, హక్కిం షాజహాన్, అశోక్, విజయరాఘవన్, మధుపాల్, శంకర్ రామకృష్ణన్, నక్షత్ర, ఐరా, నిశాంత్ సాగర్ తదితరులు
దర్శకుడు: నీసామ్ బషీర్
నిర్మాతలు : సుప్రియా మీనన్, ముఖేష్ ఆర్ మెహతా, సీవీ సారథి
ఎడిటర్: రమీస్ ఎంబీ
సంగీతం: జేక్స్ బిజోయ్
ప్రపంచం ఎప్పుడూ మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది. అదేంటంటే.. ఈ విశాల ప్రపంచంలో మనం ఒక "ఎవరూ కాదు" (Nobody) అని. పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి ప్రధాన పాత్రల్లో నటించిన 'ఐ, నోబడీ' కూడా ఇదే భావాన్ని తీసుకుని, దానికంటే ముందుకు వెళ్లి ఒక కీలకమైన ప్రశ్నను మనపై సంధింస్తుంది. అదేంటంటే.. "ఒక సామాన్యుడికి న్యాయం కావాలంటే అతను ఏమి చేయాలి?" అని. ఇదే అంశంతో రూపొందిన ‘ఐ నోబడి’ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే..
రాజీవన్ (ప్రిథ్వీరాజ్ సుకుమారన్) ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. అతని భార్య మీరా (పార్వతి) ఇంటి పనులు, ఉద్యోగం, పిల్లల బాధ్యతలను చూసుకుంటుంది. భర్తతో మీరాకు మాటలుండవు. ఇలాంటి తరుణంలో ఒక భారీ బ్యాంకు దోపిడీలో అనుకోకుండా రాజీవన్ ఇరుక్కుంటాడు. దీంతో అతని జీవితం పూర్తిగా తలకిందులవుతుంది. అనుమానాలు, సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలు మొత్తంగా అతని జీవితాన్ని, కుటుంబాన్ని ఎలా తలకిందులు చేసింది అనేదే సినిమా కథ. ముఖ్యంగా కొన్ని సంఘటనల పర్యావసనాలు.. అతడిని వ్యవస్థతో పోరాడే స్థితికి తీసుకొస్తాయి. కనీసం ఆధారాలు లేకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సైతం వార్తలు, రూమర్స్ ప్రసారం చేసి అతడిని మరింత కష్టాల్లోకి నెట్టివేస్తాయి. అసలు రాజీవన్‌కు ఆ దోపిడీతో సంబంధం ఏమిటి? అతను నిజంగా నిర్దోషి అయితే ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతాడు? అనే విషయాలను వెండితెరపై సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
'ఐ, నోబడీ' ఒక స్లో-బర్న్ హెయిస్ట్ థ్రిల్లర్. కథ ఫస్ట్ హాఫ్ మొత్తం అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రారంభంలో కాస్త స్లో అనిపించినా ఆ తరువాత స్పీడందుకుంటుంది. రాజీవన్ ఒక సాధారణ వ్యక్తిలా కనిపిస్తూ ఉంటాడు. కానీ అతని హావభావాలు, తెలివితేటలు చూసేవారికి మాత్రం అతనికి ఈ దోపిడీలో కీలక పాత్ర ఉందనిపిస్తూ ఉంటాయి. దర్శకుడు నిస్సామ్ బషీర్ దోపిడీ ఎలా జరిగిందనే దానికంటే, రాజీవన్ మనసులో ఏం జరుగుతోంది? ఈ దోపిడి నుంచి ఎలా బయటపడాలనుకుంటున్నాడు? అనే అంశాలపై ఎక్కువ ఫోకస్ చేశారు. రాజీవన్ దెబ్బలు తింటాడు.. బాధపడతాడు. అయినా తన ఒక్క తప్పు వల్ల భార్యా పిల్లల జీవితం నాశనం కాకూడదనే ఆలోచనే అతడిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశంలో రాజీవన్‌కు ఒక పోలీస్ అధికారి ఫుడ్ చైన్ గురించి వివరించే విధానం ప్రేక్షకులను కట్టి పేడస్తుంది. సాధారణంగా మిడతను కప్ప తింటుంది. కానీ ఈ ప్రపంచంలో బతకాలంటే మిడతే కప్పను తినాలని చెప్పడం... ప్రస్తుత ప్రపంచం క్రూరత్వాన్ని చక్కగా వివరించినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా రచయిత సమీర్ అబ్దుల్ ఎంచుకున్న నాన్-లీనియర్ కథనం ఫస్ట్ హాఫ్‌లో మంచి ఉత్కంఠను సృష్టిస్తుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత సినిమా
ఎవరెలా చేశారంటే..
పృథ్వీరాజ్ సుకుమారన్.. తన పాత్రలో ఒదిగిపోయారు. చాలా హుందాగా కనిపించారు. కానీ చాలా వరకూ సన్నివేశాల్లో ఒకే రకమైన హావభావాలను ప్రదర్శించినట్టుగా అనిపించింది. పార్వతి అయితే తన పాత్రలో జీవించారనే చెప్పాలి. భార్యగా, తల్లిగా, స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన మహిళగా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు రాజీవన్ పాత్రను, మీరా పాత్రను తీర్చిదిద్దిన విధానమే సినిమాకు ప్రధాన బలం. కానీ దర్శకుడు సెకండాఫ్, ఎండింగ్‌పై మరింత ఫోకస్ పెట్టి ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఉండేది. సినిమాటోగ్రాఫర్ దినేష్ పురుషోత్తమన్ పనితనం సినిమాను ఓ మెట్టు ఎక్కించింది. ముఖ్యంగా లిఫ్ట్ ఫైట్ సీన్, స్లో-మోషన్ ట్రాకింగ్ షాట్లు, నిక్సన్ జార్జ్ అందించిన సౌండ్ డిజైన్ సినిమాను చాలా ఆసక్తికరంగా మార్చాయి. ఎడిటింగ్ మాత్రం చాలా పేలవంగా ఉంది. కనీసం ఒక అరగంట పాటు అయినా సినిమాను కత్తిరించి ఉంటే చాలా బాగుండేది. మంచి కథ, కొత్త తరహా స్క్రీన్‌ప్లే ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో ల్యాగ్ కారణంగా ప్రేక్షకుడికి కొంత విసుగు తెప్పిస్తుంది.
ఫైనల్‌గా.. విభిన్నమైన హెయిస్ట్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది.
రేటింగ్: 2.75/5
ప్రజావాణి చీదిరాల