Dhanush: తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? ఎందుకు ఆయన పేరు అంతలా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల గురించి అయితే పెద్ద విషయమే కాదు.. ఆయన పేరిట ఓ జెండా ఆవిష్కృతమైంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? ఎందుకు ఆయన పేరు అంతలా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల గురించి అయితే పెద్ద విషయమే కాదు.. ఆయన పేరిట ఓ జెండా ఆవిష్కృతమైంది. దానిని ఆయన అభిమాన సంఘమే ఆవిష్కరించింది. దానిని చూసిన వారంతా ధనుష్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ జెండాలో ధనుష్ నమస్కారం చేస్తున్నట్టుగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎరుపు, తెలుపు రంగులతో డిజైన్ చేసిన ఫ్లాగ్ ఉంది. మొత్తానికి రాజకీయ పార్టీ జెండాను తలపించేలా ఉండటంతో ఇక ధనుష్ కూడా రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నాడంటూ టాక్ మొదలైంది.
అభిమానులు మాత్రమే కాదు... రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై ఆసక్తిగా చర్చిస్తున్నారు. మాస్ లీడర్‌గా ధనుష్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ ప్లాన్ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయరాని బంధం ఉంది. అప్పట్లో ఎంజీఆర్ మొదలు.. ప్రస్తుతం సీఎం విజయ్ (టీవీకే పార్టీ) వరకూ దాదాపుగా అందరూ సినీ రంగానికి చెందినవారే. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న మీదట పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనాలు సృష్టించారు. ప్రస్తుతం ధనుష్ జెండా చూసిన తర్వాత ఆయన కూడా అదే బాటలో నడుస్తున్నారా? అనేది సందేహంగా మారింది. తమిళనాడులో ధనుష్‌కు సైతం బలమైన అభిమాన సంఘాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో పాలిటిక్స్‌లోకి వస్తే సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇంత జరుగుతున్నా ధనుష్ పీఆర్ టీం మాత్రం స్పందించలేదు. అసలు పట్టనట్టే వ్యవహరిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం ధనుష్ ఫోటో ఉన్న జెండాతో పెద్ద ఎత్తున చర్చకు తెరదీశారు. ధనుష్ అయితే ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ జెండా వెనుకున్న మర్మమేంటనేది మాత్రం తెలియడం లేదు. కేవలం అభిమానుల ఆనందమేనా? లేదంటే దాని వెనుక ఏదైనా లాంగ్ టర్మ్ పొలిటికల్ ప్లాన్ ఏదైనా ఉందా? అనేది తెలియడం లేదు. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రావాలంటే మరికొన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే.