PM Modi: మోదీ నెక్ట్స్ టార్గెట్ ఏపీయేనట.. టచ్‌లోకి నేతలు..!
అనుకున్నది జరగకపోతే ఎవరికైనా ఎలా ఉంటుందో కానీ మన ప్రధాని మోదీకి మాత్రం చాలా ఆగ్రహం వస్తుందనుకుంటా. ఎలాగైనా పట్టుబట్టి సాధిస్తారు. ఇప్పుడీ విషయం ఎందుకంటే.. రాజ్యాంగ సవరణలకు మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.
అనుకున్నది జరగకపోతే ఎవరికైనా ఎలా ఉంటుందో కానీ మన ప్రధాని మోదీకి మాత్రం చాలా ఆగ్రహం వస్తుందనుకుంటా. ఎలాగైనా పట్టుబట్టి సాధిస్తారు. ఇప్పుడీ విషయం ఎందుకంటే.. రాజ్యాంగ సవరణలకు మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇటీవల ఈ సూపర్ మెజారిటీ లేకే కేంద్రంలో మోదీ ప్రభుత్వం తను అనుకున్నది సాధించలేకపోయింది. మరి మోదీ వదిలేస్తారా? వదిలేదేలే..
'ఒకే దేశం, ఒకే ఎన్నిక'.. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వంటి ప్రధాన నిర్మాణాత్మక మార్పుల కోసం బీజేపీ నానా తిప్పలు పడుతోంది. ఈ రెండు విధానాలు అమలైతే.. కేంద్రంలో బీజేపీకి తిరుగుండదనే ఆలోచన ప్రధాని మోదీది. కానీ దానికి అవసరమైన సూపర్ మెజారిటీ లేదు. దీనికి ఏం చేయాలో మోదీ ప్రస్తుతం అదే చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలను మంచి స్కెచ్ గీసి మరీ తమ పార్టీలోకి లాగుతున్నారు.
కేంద్రాన్ని ఏకిపారేసిన చద్దా..
సీన్ కట్ చేస్తే తాజాగా ఏడుగురు ఆప్ ఎంపీల విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం తెలిపారు. ఆ ఏడుగురు ఆప్ ఎంపీల విలీనంతో రాజ్యసభలో బీజేపీ బలం 113కు చేరగా, ఆప్ బలం మూడుకు పడిపోయింది. ఇక బీజేపీలో చేరిన వారిలో ఎంపీలు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ కుమార్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ ఉన్నారు. వీరందరిలో రాఘవ్ చద్దా బీజేపీలో చేరడమే అందరినీ విస్మయానికి గురి చేసింది. జస్ట్ కొద్దిరోజుల ముందు ఆయన సభలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. ఒకే వస్తువుపై ఎన్నిసార్లు ప్రజలపై పన్నుల భారం మోపుతారంటూ నిలదీసి దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు. ఆ తరువాత పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అవన్నీ అప్రస్తుతం. అలాంటి రాఘవ్ చద్దానే మోదీ తన వైపు లాగేసుకున్నారు. ఇక మోదీ నెక్ట్స్ టార్గెట్.. రాష్ట్రాలేనని తెలుస్తోంది.
ఏపీ టార్గెట్ ఎందుకు?
ఇక్కడ కూడా రెండు విషయాలున్నాయి. ఒకటేంటంటే.. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రాలు. ఈ రెండింటిలోని ఎంపీలను తమ వైపు తిప్పుకోవడమే మోదీ లక్ష్యమనే చర్చ దేశమంతా నడుస్తోంది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలంటే ఓకే కానీ లేని బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రాలను తమ వైపు తిప్పుకోవడమేంటనే సందేహం రావొచ్చు. ముఖ్యంగా మోదీ నెక్ట్స్ టార్గెట్ ఏపీ వంటి రాష్ట్రాలేనని టాక్ నడుస్తోంది. ఏపీని తమ వైపు తిప్పుకోవాల్సిన అవసరం ఏముందంటారా? తెలంగాణ, ఏపీ విడిపోయిన తర్వాత అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే.. రాష్ట్రమంతా ఆయనేదో చేస్తారని భావించింది కానీ ఆయన మాత్రం కేవలం పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చి చేతులు దులిపేసుకుని వెళ్లిపోయారు.
మోదీతో టచ్‌లోకి నేతలు..
కట్ చేస్తే ప్రస్తుతం కేంద్రంలో ఏపీ కీలక భూమిక పోషిస్తోంది. కాబట్టి ఏపీ ఏం అడిగితే దానిని కేంద్రం నెరవేర్చాల్సి వస్తోంది. అదే ఆ పార్టీ ఎంపీలంతా తమ పార్టీలోకి వచ్చేస్తే? ఏపీకి ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదనేది ఆయన భావన అని అంతా చెప్పుకుంటున్నారు. అలాగే అధికారంలో లేని రాష్ట్రాల ఎంపీలను సైతం లాగేస్తే పార్లమెంటులో బలం పెరిగి తద్వారా రాజ్యాంగ సవరణలు యథేచ్చగా చేయవచ్చనేది కేంద్రంలోని బీజేపీ స్కెచ్‌గా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి కొందరు నేతలు మోదీతో టచ్‌లోకి వెళ్లారని సమాచారం. ఇక ఏపీపై కూడా ఆయన కన్నేస్తే పట్టుకోవడం కష్టమే. మొత్తానికి నెక్ట్స్ మోదీ టార్గెట్‌లో ఏపీ కూడా ఉందని గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? మోదీ ఇలా చేస్తే టీడీపీ, జనసేనలు చూస్తూ ఊరుకుంటాయా? ఇక చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో.
ప్రజావాణి చీదిరాల