Vishal: రాష్ట్రాన్ని బట్టి రూల్ మారుతుందా? ప్రజా తీర్పుకు గౌరవం లేదా?
రాష్ట్రాన్ని బట్టి రూల్ మారిపోతుందా? లేదంటే ఫామ్ చేయబోయే ప్రభుత్వాన్ని బట్టి మారుతుందా? అంటే రెండోదే నిజమనిపిస్తోంది. 2017-18లో గోవా, మణిపూర్, మేఘాలయ, కర్ణాటక ఎన్నికలను పరిశీలిస్తే అక్కడొక రూల్.. తమిళనాడులో ఒక రూలేంటని అనిపిస్తోంది.
రాష్ట్రాన్ని బట్టి రూల్ మారిపోతుందా? లేదంటే ఫామ్ చేయబోయే ప్రభుత్వాన్ని బట్టి మారుతుందా? అంటే రెండోదే నిజమనిపిస్తోంది. 2017-18లో గోవా, మణిపూర్, మేఘాలయ, కర్ణాటక ఎన్నికలను పరిశీలిస్తే అక్కడొక రూల్.. తమిళనాడులో ఒక రూలేంటని అనిపిస్తోంది. ఒకరకంగా విజయ్ సాధించిన విజయం సాధారణమైందేం కాదు.. గిరి గీసి మరీ.. కేవలం రెండంటే రెండు నెలల్లోనే అధికార పార్టీతో పాటు ప్రత్యర్థి పార్టీని మట్టికరిపించారు. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ రెండు పార్టీలదే దశాబ్దాలుగా అధికారం. ఇన్నాళ్లకు ఈ రెండు పార్టీలను విజయ్ స్థాపించిన టీవీకే చుక్కలు చూపించింది. కానీ అధికారాన్ని ఫామ్ చేసేందుకు పది సీట్లు తగ్గాయి. ముందుగా గవర్నమెంట్‌ను ఫామ్ చేసి తరువాత మెజారిటీని నిరూపించుకోవాలని కోరవచ్చు కానీ తమిళనాడు గవర్నర్ అయితే దానికి తిరస్కరిస్తున్నారు.
టీవీకే చీఫ్ విజయ్ గురువారం మరోసారి లోక్‌భవన్‌కు వెళ్లారు. ఎన్నికల ఫలితాల అనంతరం కేవలం రెండు రోజుల వ్యవధిలో విజయ్ రెండు పర్యాయాలు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అనుమతి ఇవ్వడంతో పాటు అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ గవర్నర్ ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. మేజిక్ ఫిగర్ అయిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతోనే రావాలని విజయ్‌కు గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై తమిళనాడు సినీ సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో విశాల్ గవర్నర్ తీరుపై ట్విటర్ వేదికగా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
2017-18లో గోవా, మణిపూర్, మేఘాలయ, కర్ణాటకలో జరిగిన పరిస్థితుల మాదిరిగానే తమిళనాడులోనూ జరుగుతోందని.. కానీ అక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని హీరో విశాల్ పేర్కొన్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో జరిగిన బల పరీక్ష ద్వారా తమ మెజారిటీని నిరూపించుకోవాలని ఆయా రాష్ట్రాలను కోరారని అన్నారు. అదే పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని విజయ్‌కు కల్పించడానికి తమిళనాడు గవర్నర్ ఎందుకు సంకోచిస్తున్నారని నిలదీశారు. ప్రజల తీర్పుకు అసలు ఏమాత్రం గౌరవం లేదా? అని విశాల్ నిలదీశారు. టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ స్థానాలకు అత్యంత చేరువలో నిలిచి, ఇంత భారీ ప్రజా తీర్పును పొందిన తర్వాత, మాకు కావాల్సింది ఒక ప్రభుత్వం తప్ప, గవర్నర్ పాలన కాదని విశాల్ పేర్కొన్నారు. ఈ ప్రాథమిక హక్కుల గురించి రాజకీయ నాయకులకు మాత్రమే కాదన్నారు. ‘ప్రియమైన విజయ్, నువ్వే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి / చేస్తావు. ఒక ఓటరుగా, నేను ఆ విషయాన్నే మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నాను’ అని విశాల్ పేర్కొన్నారు.
ప్రజావాణి చీదిరాల