ఇండియన్ కంపెనీలకు స్వదేశం వద్దా? యూఎస్‌లో షాకింగ్ స్థాయిలో పెట్టుబడులా?
ఒకవైపు అమెరికాలో ఇండియన్స్ దారుణాతి దారుణమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో అమెరికా వెళ్లి చదువుకుందామనుకుంటున్న విద్యార్థులు సైతం ట్రంప్ అవలంభిస్తున్న విధానాల కారణంగా డ్రాప్ అవుతున్నారు. అక్కడకు ఇప్పటికే వెళ్లినవారు ఉండలేక రిటర్న్ అవుతున్నారు.
టెక్నాలజీ, మేనిఫాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలలో భారతీయ కంపెనీలు అమెరికాలో 20.5 బిలియన్ డాలర్లకు పైగా విలువైన పెట్టుబడులకు సిద్ధమయ్యాయని భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ బుధవారం తెలిపారు. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎకనమిక్ లీడర్‌షిపే కారణమంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఒకవైపు అమెరికాలో ఇండియన్స్ దారుణాతి దారుణమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో అమెరికా వెళ్లి చదువుకుందామనుకుంటున్న విద్యార్థులు సైతం ట్రంప్ అవలంభిస్తున్న విధానాల కారణంగా డ్రాప్ అవుతున్నారు. అక్కడకు ఇప్పటికే వెళ్లినవారు ఉండలేక రిటర్న్ అవుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఇండియన్స్ సిద్ధమవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదేదో మన దేశంలో పెడితే ఇండియా డెవలప్ అవుతుంది కదా. ఇక్కడ ఉన్న యువత వేరే దేశానికి వలస సాగించడం ఆగుతుంది. అదేమీ లేదు. ఏకంగా 12 భారతీయ కంపెనీలు 1.1 బిలియన్ డాలర్ల విలువైన కొత్త పెట్టుబడులను ప్రకటించాయని సెర్గియో తెలిపారు. అయితే ఆ పెట్టుబడి పెడుతున్న కంపెనీల పేర్లను మాత్రం గోర్ వెల్లడించలేదు. ఆయా కంపెనీలకు దేశ ప్రయోజనాలతో పని లేదు. కేవలం స్వప్రయోజనాలే ముఖ్యం. భారతీయులు పడుతున్న ఇబ్బందుల గురించి వారికే ఎక్కువగా తెలుసు. అయినా కూడా పెట్టుబడులకు ఏమాత్రం వెనుకాడటం లేదు.