Vijay Dalapathy: విజయ్ ప్రభంజనం.. ట్విటర్ ట్రెండింగ్‌లో త్రిష..
ఇవాళ విజయ్ టీవీకే పార్టీ విజయం దిశగా దూసుకెళుతోంది. ఈ క్రమంలోనే ట్విటర్‌లో ‘జయనాయగన్’ టైటిల్ ట్రెండింగ్‌లో ఉంది. విజయ్ అభిమానులు ఈ సినిమాలోని డైలాగ్స్‌ను వైరల్ చేస్తున్నారు.
‘జయనాయగన్’.. సినిమాను అయితే అడ్డుకున్నారు కానీ విజయ్ దళపతి విజయాన్ని మాత్రం తమిళనాడు పొలిటికల్ పార్టీలు అడ్డుకోలేకపోయాయి. ఇప్పుడు ఈ సినిమా తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ నటించిన చివరి చిత్రమిది. ఈ చిత్రం చివరి నిమిషంలో ఆగిపోయింది. ఆ తరువాత సోషల్ మీడియాలో సినిమా లీక్ అయ్యింది. తనను అడ్డుకోలేక.. తన సినిమానను అడ్డుకున్నారంటూ స్వయంగా విజయ్ చెప్పడంతో ఈ సినిమా ఎన్నికల ప్రచారంలో కీలకమైంది. ఇవాళ విజయ్ టీవీకే పార్టీ విజయం దిశగా దూసుకెళుతోంది. ఈ క్రమంలోనే ట్విటర్‌లో ‘జయనాయగన్’ టైటిల్ ట్రెండింగ్‌లో ఉంది. విజయ్ అభిమానులు ఈ సినిమాలోని డైలాగ్స్‌ను వైరల్ చేస్తున్నారు.
మరోవైపు త్రిష పేరు కూడా నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. దీనికి కారణం ఇవాళ ఆమె పుట్టినరోజు కావడమే. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అభిమానులు, సినీ ప్రముఖులు త్రిషకు శుభాకాంక్షలు చెబుతారు. ఈ నేపథ్యంలో త్రిష పేరు ట్విటర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక టీవీకే విషయానికి వస్తే.. ’పంబరేగగొట్టే వాడి పేరు వినే ఉంటావు.. అందులోనూ రికార్డులు సృష్టించే వాడి పేరు విన్నావా.. అతడే దళపతి’ అనే ‘జయనాయగన్’ చిత్రంలోని డైలాగ్‌తో పాటు.. ‘అర్హత లేనివారంతా కలిసి నిలబడ్డారు. వాళ్లు గెలవకూడదు’ వంటి డైలాగ్స్ అన్నీ నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.