Entertainment Breaking News

M4M Movie: యూనివర్సల్ సబ్జెక్ట్.. క్లైమాక్స్ థ్రిల్లిస్తుంది..

అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder). ఈ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌లో జోష్‌ను పెంచారు.

M4M Movie: యూనివర్సల్ సబ్జెక్ట్.. క్లైమాక్స్ థ్రిల్లిస్తుంది..

అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder). ఈ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌లో జోష్‌ను పెంచారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలుగు సినీ దర్శకుల సంఘం (TFDA) అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, సీనియర్ వి. సముద్ర హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా దర్శకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ వేడుక జరగడం ప్రత్యేకతగా నిలిచింది.

ఈ సందర్భంగా వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. మోహన్ వడ్లపట్ల తన టీమ్‌తో కలిసి గొప్ప టాలెంట్‌ను తెరపై ప్రదర్శించారని ప్రశంసించారు. జో శర్మకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ.. మే 8న విడుదల కానున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. మోహన్ వడ్లపట్ల గొప్ప దర్శకుడిగా ఎదగాలని కోరుకున్నారు. టీఎఫ్‌డీఏ సెక్రటరీ పెండ్యాల మాట్లాడుతూ.. M4M ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉందన్నారు. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ కొత్తగా ఉందన్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా 24 శాఖలను సమన్వయం చేస్తూ రూపొందించారని, టీమ్ ఎంతో కష్టపడి పనిచేసిందని తెలిపారు. కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నారు.

హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శకుడు మోహన్ వడ్లపట్లకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. ఇప్పటికే ఈ చిత్రానికి 15కి పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. సినిమాలోని సీరియల్ కిల్లర్ ఎవరో చెప్పిన వారికి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించినట్లు తెలిపారు. M4M యూనివర్సల్ సబ్జెక్ట్ అని, క్లైమాక్స్ ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచుతుందని చెప్పారు. ఈ సినిమా ద్వారా ఒక కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నామని పేర్కొన్నారు. నటుడు ఎంఆర్‌సీ వడ్లపట్ల మాట్లాడుతూ.. మోహన్ వడ్లపట్ల మంచి టీమ్‌తో మంచి సినిమా తీశారని, హీరోయిన్ జో శర్మ ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 4, 2026 12:57 PM