వరలక్ష్మి శరత్‌కుమార్ వల్ల ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి భారీ నష్టం: సంజీవ్ మేగోటి
హారర్, యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా జూన్ 12న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వరలక్ష్మి శరత్‌కుమార్ వల్ల ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి భారీ నష్టం వాటిల్లిందంటూ దర్శకుడు సంజీవ్ మేగోటి ఇవాళ (బుధవారం) ప్రెస్‌మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. హారర్, యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా జూన్ 12న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సినిమా ప్రమోషన్స్‌కు సహకరించకపోవడం వల్ల తమ చిత్రానికి భారీ నష్టం వాటిల్లిందన్నారు. “ఇది నేను దర్శకత్వం వహించిన 11వ చిత్రం. నా కథను నమ్మి సినిమా నిర్మించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. 52 మంది సీనియర్ కళాకారులతో కేవలం 45 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వినూత్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. హారర్ థ్రిల్లర్ అంశాలతో పాటు యాక్షన్, ఎమోషన్‌లను సమపాళ్లలో మేళవించాం. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన వరలక్ష్మి శరత్‌కుమార్‌కు కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర లభించింది. ఆమె సౌకర్యం కోసం మేము అన్ని విధాలా సహకరించాం. కానీ డబ్బింగ్‌కు కూడా సరిగా అందుబాటులో లేకపోవడం మాకు ఇబ్బందులు కలిగించింది. అగ్రిమెంట్ ప్రకారం ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ స్పందించలేదు. కేవలం గంటసేపు ప్రమోషన్ కార్యక్రమానికి రావాలని కోరినా రాలేదు. డబ్బులు తీసుకున్న తర్వాత ఇలా వ్యవహరించడం బాధాకరం. దీని వల్ల మా చిత్రానికి భారీ నష్టం జరిగింది. మా సినిమా కాన్సెప్ట్ ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ మాదిరిగానే కర్మ ఎవరినీ వదిలి
ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన హీరో కృష్ణసాయి మాట్లాడుతూ.. “సూపర్ స్టార్ కృష్ణగారిపై రూపొందించిన ప్రత్యేక గీతంలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఫిలిం సిటీలో ఆ పాటను అద్భుతంగా చిత్రీకరించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర వంటి ప్రధాన నటీనటులు ప్రమోషన్స్‌కు రాకపోవడం బాధాకరం. అగ్రిమెంట్ ఉన్నప్పటికీ సహకరించకపోవడం సరికాదు. దర్శకుడు సంజీవ్ మేగోటి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ఇండస్ట్రీలో పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిగత పీఆర్వో బాలాజీ శర్మ మాట్లాడుతూ, “కృష్ణసాయి చిన్నప్పటి నుంచే సూపర్ స్టార్ కృష్ణగారి వీరాభిమాని. ఈ సినిమాలో కృష్ణగారిని గుర్తు చేసే పాట ఎంతో అద్భుతంగా రూపొందింది. ప్రతి అభిమానికి ఆ గీతం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. జూన్ 12న విడుదలయ్యే ఈ చిత్రాన్ని కృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.
నటి బేబీ తనుశ్రీ మాట్లాడుతూ.. “కృష్ణసాయి సార్‌తో కలిసి ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది, డైరెక్టర్ సార్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు” అని తెలిపారు. నటి కృతి వర్మ మాట్లాడుతూ, “నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సంజీవ్ మేగోటి గారికి, సహకరించిన కృష్ణసాయి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా నా కెరీర్‌కు మంచి బూస్ట్ ఇస్తుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు. హారర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్ర ట్రైలర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ కాన్సెప్ట్ చుట్టూ తిరిగే కథపై ఆసక్తి నెలకొంది. జూన్ 12న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.