Entertainment

M4M Movie Review: M4M సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?

జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు (మే 08) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలకు ముందే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌ల్లో 15కి పైగా అవార్డులు అందుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? తెలుసుకుందాం.

M4M Movie Review: M4M  సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?

చిత్రం: M4M

విడుదల: 08-05-2026

నటీనటులు: జోశర్మ, సంబీత్ ఆచార్య, శుభలేఖ సుధాకర్, సత్యకృష్ణ

దర్శకుడు: మోహన్ వడపట్ల

సంగీతం: వసంత్ ఇసపెట్టై

ఎడిటర్: ఆనంద్ పవన్

టాలీవుడ్‌లో 'మల్లెపూవు', 'మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ వంటి స‌క్సెస్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నిర్మాత మోహన్ వడపట్ల. ప్రస్తుతం దర్శకుడిగా మారి M4M మూవీని తెరకెక్కించారు. జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు (మే 08) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలకు ముందే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌ల్లో 15కి పైగా అవార్డులు అందుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? తెలుసుకుందాం.

​కథేంటంటే..

ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ హైదరాబాద్ నగరాన్ని గడగడలాడిస్తూ ఉంటాడు. ఒక మర్డర్ చేయడం అనంతరం ఆ మర్డర్‌ను ప్రసిద్ధ చిత్రలేఖనాల రూపంలో అలంకరించడం పరిపాటిగా మారుతుంది. ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు? అతడిని గుర్తించడం ఎలా అనేది పోలీసులకు సవాల్‌గా మారుతుంది. ఈ వరుస హత్యల మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ కృష్ణ (సంబీత్ ఆచార్య) ఒక‌వైపు, మ‌రోవైపు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాధ (జో శర్మ) రంగంలోకి దిగుతారు. తమ సొంత దర్యాప్తును ప్రారంభిస్తారు. అయితే కిల్లర్ మాత్రం ఎప్పటికప్పుడు పోలీసులకు సవాళ్లను విసురుతూనే ఉంటాడు. కిల్లర్ పోలీసులను తన వాయిస్ మెసేజ్‌లతో సవాల్ చేస్తుంటే, కృష్ణ, రాధ ఈ మర్డర్స్ వెనుక ఉన్న మోటివ్‌ను కనుగొనేందుకు యత్నిస్తూ ఉంటారు. మరి ఫైనల్‌గా ఈ మర్డర్ మిప్టరీని పోలీసులు ఛేదించారా? ఇంతకీ ఆ మర్డర్స్ చేస్తున్న వ్యక్తి ఎవరు? అనేది వెండితెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేవి ఇటీవలి కాలంలో వస్తూనే ఉన్నాయి. అయితే సీట్ ఎడ్జ్‌న కూర్చోబెట్టేవి మాత్రం చాలా అరుదు అనే చెప్పాలి. ఈ సినిమా క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉంటుంది. మర్డర్స్ చేస్తున్నది ఎవరనేది ఒక అంశమైతే.. ఈ మర్డర్స్ వెనుక ఉన్న మోటివ్ ఏంటనేది మరో ఆసక్తికర అంశం. అలాగే హత్యానంతరం మృతదేహాలను ప్రసిద్ధ చిత్రలేఖనాలతో పోల్చడం అనేది మరింత ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుది. ముఖ్యంగా "Lovers-II" వంటి పెయింటింగ్‌లను హత్యలతో ముడిపెట్టడం ఉత్కంఠకు దారి తీస్తుంది. ఇందులో ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. అతను హత్యలు చేసిన తర్వాత, ఆ మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో వంటి ఫేమ‌స్ పెయింటింగ్స్ (కళాఖండాల) తరహాలో డెకరేట్ చేయడం అనేది కొత్తగా చూస్తాం. ఇప్పటి వరకూ ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఎక్కడా రాలేదనే చెప్పాలి. ఈ సినిమా స్క్రీన్‌ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటూ.. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌న కూర్చోబెడుతుంది.

ఎవరెలా నటించారంటే..

ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ రాధ పాత్రలో అమెరికన్ నటి జో శర్మ జీవించేశారు. ఆమె ఈ సినిమాకు మెయిన్ పిల్ల‌ర్‌ అనడంలో సందేహమే లేదు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, డాన్స్.. ప్రతి అంశంలోనూ జో శర్మ మంచి ప్రతిభ కనబరిచాు. ఇక హీరో పాత్ర‌లో సంబీత్ ఆచార్య ఏసీపీ కృష్ణ బాగా సూట్ అయ్యారు. ఆయన పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయారు. సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? తమ పాత్రల్లో జీవించేశారు.

టెక్నికల్ పరంగా..

గతంలో 'మెంటల్ కృష్ణ', 'కలవరమాయె మదిలో' వంటి చిత్రాలను అందించిన మోహన్ వడ్లపట్ల, త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా కూడా మనకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ అనిపించదు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు బీజీఎం ప్రాణం. ఆ విషయంలో వసంత్ ఇసైపెట్టై అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. ​సినిమాటోగ్రఫీ మ‌రో హైలైట్. సంతోష్ షానమోని రెడ్ వి-రాప్టర్ తన కెమెరాతో మేజిక్ చేశారు. నగరంలోని థ్రిల్లింగ్ వాతావరణాన్ని చక్కగా బంధించారు.

హైలైట్స్:

సినిమా చివరలో వచ్చే ట్విస్ట్‌లు,

హంతకుడు మర్డర చేసే విధానం

మర్డర్ వెనుక ఉన్న మోటివ్

 

ఫైనల్‌గా.. M4M ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌న కూర్చోబెడుతుంది.

రేటింగ్: 3.0

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 8, 2026 1:14 PM