వామ్మో.. ఈ జంట కూడా విడిపోతున్నారా? సడెన్ షాక్ ఇచ్చిన మోస్ట్ లవబుల్ కపుల్..
ఇండస్ట్రీలో ఎవరెప్పుడు కలుస్తారో చెప్పలేం.. ఎవరెప్పుడు విడిపోతారో కూడా చెప్పలేం. దాదాపుగా విడిపోయేదుంటే మాత్రం వివాహమైన రెండు, మూడేళ్లలోనే విడిపోతుంటారు.
ఇండస్ట్రీలో ఎవరెప్పుడు కలుస్తారో చెప్పలేం.. ఎవరెప్పుడు విడిపోతారో కూడా చెప్పలేం. దాదాపుగా విడిపోయేదుంటే మాత్రం వివాహమైన రెండు, మూడేళ్లలోనే విడిపోతుంటారు. కానీ ఈ జంట మాత్రం వివాహమైన 15 ఏళ్లకు విడిపోతున్నట్టుగా ప్రకటించింది. మరి ఆ జంట ఎవరంటారా? మరాఠీ సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరు పొందిన ఆదినాథ్ కొఠారే, ఊర్మిళ కనేట్కర్. వీరిద్దరూ తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. అధికారిక ప్రకటన కూడా చేసేశారు. దాదాపు 15 సంవత్సరాల దాంపత్య జీవితం అనంతరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని జూలై 16న సోషల్ మీడియా వేదికగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

మొత్తానికి విడిపోతున్నామని ఇద్దరూ కలిసి ఒకే ప్రకటనలో చెప్పేశారు. అయితే తమ కుమార్తె జిజాహ్ (Jizah) జీవితంలో ఎలాంటి లోటు రాకుండా కలిసి కో-పేరెంట్స్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. అసలు ఆ ప్రకటనలో ఆదినాథ్, ఊర్మిళ ఏం చెప్పారంటే.. "మా స్నేహితులు, మీడియా ప్రతినిధులు, శ్రేయోభిలాషులకు... ఎంతో ఆలోచించి, పరస్పర అంగీకారంతో మేము జీవిత భాగస్వాములుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా దాంపత్య ప్రయాణం ముగిసినా, మా కుమార్తె జిజాహ్ పట్ల మా బాధ్యత, ప్రేమ ఏమాత్రం తగ్గదు. ఆమె మా జీవితంలో అత్యంత ముఖ్యమైనది. ఆమె ప్రేమ, భద్రత, ఆదరణ మధ్య పెరిగేలా మేమిద్దరం కలిసి సహ-తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తాం. మా ఇద్దరికీ ఒకరిపై మరొకరంటే ఎంతో గౌరవం ఉంది. ఇన్నేళ్లుగా మాపై ప్రేమ, ఆదరణ చూపిన మీడియా, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మా జీవితంలోని ఈ కొత్త దశలో కూడా అదే ప్రేమ, ఆశీర్వాదాలు అందిస్తారని ఆశిస్తున్నాం" అని తెలిపారు.
ఇక చివరిగా అందరు చెప్పేదే చెప్పారు. అదేంటంటే.. "దయచేసి మా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి. ఈ విషయంపై ఇదే మా ఏకైక ప్రకటన. ఇకపై దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయము. మీ అర్థం చేసుకోవడాన్ని, మద్దతును అభినందిస్తున్నాం" అని పేర్కొన్నారు. ఆదినాథ్ కొఠారే, ఊర్మిళ కనేట్కర్ 2006లో 'శుభ్ మంగళ్ సావధాన్' సినిమా షూటింగ్ సమయంలో పరిచయం అయ్యారు. అనంతరం ప్రేమలో పడి 2011లో వివాహం చేసుకున్నారు. వీరికి జిజాహ్ అనే కుమార్తె ఉంది. గత కొన్ని నెలలుగా వీరిద్దరి దాంపత్య జీవితంలో విభేదాలు ఉన్నాయని, వేర్వేరుగా ఉంటున్నారనే వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2025 చివరిలో ఈ తరహా కథనాలు వచ్చినప్పటికీ, అప్పట్లో ఈ జంట వాటిపై స్పందించకపోవడంతో అంతా వాటిని వట్టి పుకార్లుగానే పరిగణించారు. కానీ ఆదినాథ్, ఊర్మిళ జంట విడిపోతున్నట్టు సడెన్‌గా ప్రకటించి షాక్ ఇచ్చింది.