Entertainment

Chiranjeevi: ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్‌కు కొన్ని గంటల ముందే షాకిచ్చిన చిరు..!

‘పెద్ది’ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ పీక్స్‌కు తీసుకువెళుతున్నారు. ఈ నెల 18న ముంబైలో సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇలాంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి షాకిచ్చారు.

Chiranjeevi: ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్‌కు కొన్ని గంటల ముందే షాకిచ్చిన చిరు..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీకపూర్ జంటగా రూపొందిన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ పీక్స్‌కు తీసుకువెళుతున్నారు. ఈ నెల 18న ముంబైలో సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇలాంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి షాకిచ్చారు. అదేంటంటే.. పెద్ది ట్రైలర్ చూశారట. చూసినవారు కామ్‌గా ఉండక ఓ మేటర్ లీక్ చేసి దర్శకుడు బుచ్చిబాబు సానకు సారీ కూడా చెప్పేశారు. ఈ మధ్య కాలంలో ఆయన లీక్స్ ఇవ్వడం ఎందుకో మానేశారు. కానీ నేడు మాత్రం చిరు లీక్స్‌కు మరోసారి తెరదీశారు. అది కూడా ట్విటర్ వేదికగా..

ట్రైలర్ చూశారట. ఊహించుకున్న దాన్ని మించి ఉందని చెప్పేశారు. మీకు లీక్స్ ఇచ్చి చాలా రోజులైందని.. అంతా తాను ఆడాననుకుంటున్నానని.. కానీ పోరాడానంటూ అసలు గుట్టు విప్పేశారు. ఆ తరువాత తీరికగా ‘సారీ బుచ్చిబాబు.. ట్రైటర్ చూశాక కంట్రోల్ తప్పా’ అన్నారు. మొత్తానికి చిరు ఇచ్చిన లీక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘‘పెద్ది ట్రైలర్ చూశాను. జస్ట్.. వావ్.. 3 నిమిషాలు.. ప్యూర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్.. చరణ్… బుచ్చి… రెహమాన్… ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. ఎమోషన్.. ఎలివేషన్.. మ్యాడ్‌నెస్ అన్నీ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు లీక్స్ (#ChiruLeaks) ఇచ్చి. మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు... సారీ బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా!’’ అన్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 16, 2026 11:46 AM