Entertainment

Kothamalupu Review: ‘కొత్త మలుపు’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?

ఆకాష్ గోపరాజు, భైరవి అర్ధ నటించిన ‘కొత్తమలుపు’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందమైన కోనసీమ ప్రాంతంలో పుట్టిన ప్రేమకథ. అలాగే మంచి సస్పెన్స్ కూడా ఉందనడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఆ అంచనాలను చిత్రం అందుకుందా? తెలుసుకుందాం.

Kothamalupu Review: ‘కొత్త మలుపు’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?

చిత్రం: కొత్తమలుపు

విడుదల: 12-06-2026

నటీనటులు: ఆకాష్ గోపరాజు, భైరవి ఆర్ధ్యా, మహేందర్, ప్రభావతి, రఘుబాబు, పృధ్వీ తదితరులు

మ్యూజిక్: యశ్వంత్ నాగ్

దర్శకత్వం: శివ వరప్రసాద్. కె

నిర్మాత: తాటి బాలకృష్ణ

ఆకాష్ గోపరాజు, భైరవి అర్ధ నటించిన ‘కొత్తమలుపు’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందమైన కోనసీమ ప్రాంతంలో పుట్టిన ప్రేమకథ. అలాగే మంచి సస్పెన్స్ కూడా ఉందనడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఆ అంచనాలను చిత్రం అందుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే..

అందమైన కోనసీమ ప్రాంతంలోని ఒక ఊరిలో ఉండే అమ్మాయి.. వరలక్ష్మి (భైరవి ఆర్ధ్యా). ఆమె అన్నయ్య వివాహం కావడంతో తన మేనత్త, మామయ్య అమెరికాలో ఉండటంతో వారి కొడుకు కమల్ (ఆకాష్ గోపరాజు) పెళ్లికోసం వరలక్ష్మి ఇంటికి వస్తాడు. హైదరాబాద్‌లో స్నేహితుడు హర్షతో కలిసి ఉండే కమల్‌కు మందు, సిగిరెట్ బాగా అలవాటవుతాయి. వరలక్ష్మి ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె చూపించే కేరింగ్‌తో అతనికి ఆమెపై ప్రేమ కలుగుతుంది. వరలక్ష్మి కూడా తన బావను ఇష్టపడుతుంది. ఈ క్రమంలోనే కమల్ ఫోన్‌కి వరలక్ష్మి వేరొక వ్యక్తితో ఉన్న ఫోటో వస్తుంది. అసలు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? దానిని కమల్‌కు ఎవరు పంపించారు? కావ్య ఎవరు? ఆమెకు.. వరలక్ష్మికి ఉన్న సంబంధం ఏమిటి? వంటి అంశాలను తెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

ఎందుకోగానీ చాలా కాలం పాటు ఇండస్ట్రీలో దాదాపుగా లవ్ స్టోరీలే లేవు. తిరిగి ఇటీవలి కాలంలో లవ్ స్టోరీల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన చిత్రం ‘కొత్త మలుపు’. కోనసీమ అందాలను ఎంత అందంగా అయితే చూపించారు. దాని చుట్టూ ఒక ప్రేమకథను కూడా దర్శకుడు అంతే అందంగా రాసుకుని ప్రెజెంట్ చేశారు. వరలక్ష్మి, ఆకాష్‌ల లవ్ స్టోరీ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే సినిమాలో లవ్ స్టోరీతో పాటు సాగే సస్పెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా నటీనటుల పరిచయం.. ఆకాష్.. వరలక్ష్మితో లవ్ వంటి అంశాలతో నడిపించిన దర్శకుడు.. సెకండ్ హాఫ్‌లో ఒక సస్పెన్స్ స్టోరీని చక్కగా నడిపించారు. ఎండింగ్ వరకూ సస్పెన్స్ రివీల్ కాకుండా నడిపించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను అద్భుతంగా నడిపించారు.

ఎవరెలా నటించారంటే..

కమల్ పాత్రలో ఆకాష్ జీవించేశాడు. మనసుకు నచ్చిన అమ్మాయిని నొప్పించలేక.. నిజమేంటో తెలియక ఇబ్బందిపడే యువకుడిగా చక్కని నటనను కనబరిచాడు. భైరవికి ఇది తొలి చిత్రమైనా కూడా ఏమాత్రం తడబడకుండా అద్బుతంగా నటించింది. ఇక రఘుబాబు, పృధ్వీ, మహేందర్, ప్రభావతి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ఈ సినిమా ఎండింగ్‌లో ఒక హీరో కూడా కేమియో చేసి మెప్పించాడు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు శివ వరప్రసాద్. కె కథను అద్భుతంగా నడిపించారు. లవ్‌స్టోరీతో పాటు సస్పెన్స్ ఎక్కడా రివీల్ కాకుండా చివరి వరకూ మెయిన్‌టైన్ చేశారు. ఈ చిత్రం విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ గురించి చెప్పాలి. కోనసీమ అందాలను అద్భుతంగా చూపించారు. మ్యూజిక్ కూడా సినిమాకు హైప్ ఇచ్చింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నిర్మాత బాలకృష్ణ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తేనే అర్థమవుతుంది.

ఫైనల్‌గా.. ‘కొత్త మలుపు’ ట్విస్ట్‌లతో కూడిన ప్రేమకథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 3/5

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 12, 2026 1:53 PM