Purusha Producer: కచ్చితంగా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాం..
బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష’. పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహించారు.
బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష’. పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు ఈ చిత్రం మే 22న విడుదల కానుండటంతో మేకర్స్ ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బత్తుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. దర్శకుడు వీరు తనను ఎంతో బాగా చూసుకున్నారని.. తనకు ఈ జర్నీలో ఎంతగానో సహకరించారన్నారు. తనకు కెమెరా ఫియర్‌ను ఆయనే తొలగించారన్నారు. శ్రవణ్ మంచి పాటల్ని ఇవ్వగా.. రవి మంచి సెట్స్ వేసిచ్చారన్నారు. సప్తగిరి, కసిరెడ్డి తనను సొంత తమ్ముడిలా చూసుకున్నారని... వారే తనలో భయాన్ని, బిడియాన్ని పోగొట్టారన్నారు. వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, వీటీవీ గణేష్‌తో వర్క్ చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు. సప్తగిరి మాట్లాడుతూ .. వీరు కథ చెప్పినప్పుడు తన ఇన్‌పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేశానన్నారు. కానీ వీరు మాత్రం తన దారిలోనే వెళ్లారని.. అనుకున్నట్టుగానే సినిమాని తీశారన్నారు. సతీష్ ముత్యాల మంచి విజువల్స్ ఇచ్చారని.. శ్రవణ్ పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయన్నారు. బీజీఎం కూడా అదిరిపోతుందన్నారు.
దర్శకుడు వీరు వులవల మాట్లాడుతూ .. సరస్వతి బత్తుల వల్లే ‘పురుష:’ ఇక్కడి వరకూ వచ్చిందన్నారు. ఈ జర్నీలోని ప్రతీ దశలో ఆమె తమకు సపోర్ట్‌గా నిలిచారన్నారు. కథ విన్నాక, స్టోరీ బోర్డ్ చూశాక కోటేశ్వరరావు ఓకే చెప్పారని... నిర్మాత ఖర్చుకి ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. సప్తగిరి ఈ చిత్రంలో మగజాతి ఆణిముత్యంలా అందరినీ నవ్విస్తారన్నారు. రాజ్ కుమార్ కామెడీ టైమింగ్ బాగుంటుందని... ఆయన్నుంచి వచ్చే ప్రతీ డైలాగ్ ఎంటర్టైనింగ్‌గా ఉంటుందని వీరు వులవల పేర్కొన్నారు. నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ .. తనకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని.. తనకు సినిమాలంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. కాలేజీ టైంలో స్టోరీలు రాసుకునేదాన్నని, డైరెక్టర్ అవ్వాలని అనుకునే దాన్నని అన్నారు. కానీ ఎప్పుడూ తన ఆలోచనల్ని బయట పెట్టలేదన్నారు. తన తమ్ముడిని అన్నలా చూసుకోవాలని ఈ మూవీని తీశానని తెలిపారు. తనకు నా తమ్ముడే సర్వస్వమన్నారు. మే 22న పురుష సినిమా రాబోతోందని.. కచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తామన్నారు.