Memu Coplam: ‘మేము ‘కాప్’లం’ ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది..
ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. సినిమాలకు మించిన క్రేజ్ వీటికి ఉంది. తాజాగా జీ5లో మరో వెబ్ సిరీస్ నేటి (మే 22) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రా ఎంటర్‌టైన్‌మెంట్స్ (ప్రొడక్షన్ నెం. 3) బ్యానర్‌పై బీవీఎస్. రవి నిర్మించిన ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌కు ‘వికటకవి’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహి
ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. సినిమాలకు మించిన క్రేజ్ వీటికి ఉంది. తాజాగా జీ5లో మరో వెబ్ సిరీస్ నేటి (మే 22) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రా ఎంటర్‌టైన్‌మెంట్స్ (ప్రొడక్షన్ నెం. 3) బ్యానర్‌పై బీవీఎస్. రవి నిర్మించిన ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌కు ‘వికటకవి’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్‌లో గెటప్ శ్రీను, రవి తేజ నన్నిమాల వంటి ప్రముఖ తారాగణం నటించారు. ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ నేపథ్యంలో గురువారం నాడు గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమన్, బండ్ల గణేష్, అజయ్ భూపతి, కోన వెంకట్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ .. ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌కు సంగీతం అందించడం ఆనందంగా ఉందన్నారు. సాకేత్ తండ్రి మ్యూజిక్ ప్రపంచానికి ఎంతో సేవ చేస్తున్నారన్నారు. ధ్రువన్ పాటలు రాయడం ఆనందంగా ఉందన్నారు. అజయ్ భూపతి మాట్లాడుతూ .. ‘‘మేము కాప్’లం’’ అనే టైటిల్ కాంట్రవర్సీ అవుతుందేమో అని అనుకున్నానని.. కానీ ట్రైలర్ మాత్రం వినోదాత్మకంగా ఉందన్నారు. ఇండస్ట్రీలో రవి హవా నడుస్తోందని.. ఇలాంటి కామెడీ వెబ్ సిరీస్‌లు చాలా తక్కువగా వస్తున్నాయన్నారు. 17 రోజుల్లోనే ఇలాంటి క్వాలిటీతో తీయడం అంటే మామూలు విషయం కాదన్నారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ .. ప్రదీప్ తనకు నచ్చాడని.. ఆయన తన అమ్మానాన్నను తీసుకు వచ్చి ఇక్కడ కూర్చోపెట్టడం తనకు హ్యాపీగా అనిపించిందన్నారు. రవి ఇంత వరకు నాకు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పలేదని.. తను మాత్రం అన్ని విషయాలు ఆయనకు చెబుతానన్నారు. కేవలం 17 రోజుల్లోనే సిరీస్ తీశారంటే నమ్మలేకపోయానని.. ఈ సిరీస్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. కోన వెంకట్ మాట్లాడుతూ .. ఇదొక రిఫ్రెషింగ్ కంటెంట్‌లా ఉందన్నారు. రవికి అన్ని క్రాఫ్టుల మీద పట్టుందని... మార్కెటింగ్‌లో అందరి కంటే ముందుంటాడన్నారు. రవి, కౌముది కలిసి చేసిన ఈ సిరీస్ మంచి విజయం సాధించాలని పేర్కొన్నారు. నిర్మాత కౌముది మాట్లాడుతూ .. ప్రదీప్ వల్లే ఈ ప్రాజెక్ట్ మా వరకు వచ్చిందని... ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పారు. పొలిటికల్ పనుల్లో బిజీగా ఉన్నా తమకు నాగబాబు డేట్స్ అడ్జస్ట్ చేశారన్నారు. మాకు ఈ ప్రయాణంలో రవి బ్యాక్ బోన్‌లా నిలిచారని పేర్కొన్నారు.
నిర్మాత బీవీఎస్ రవి మాట్లాడుతూ .. శోభన్, చాణక్య వర్మ ఈ కథను తనకు చెప్పారన్నారు. ప్రదీప్ నాకు ఆప్తుడని.. 30 ఏళ్లలో ఆయనలాంటి ఓ డైరెక్టర్‌ని చూడలేదన్నారు. కోడి పోవడం, దాన్ని పట్టుకునేందుకు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు రంగంలోకి దిగుతారన్నారు. ఈ క్రమంలోనే గెటప్ శ్రీను గొప్ప నటుడు. రవి, శ్రీను కలిసి చేసిన పర్ఫామెన్స్ అదిరిపోతుందన్నారు. సిరీస్ ఆనందంగా, ఆహ్లాదంగా, సరదాగా ఉంటుందని.. అందరూ చూసి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నట్టుగా రవి పేర్కొన్నారు. జీ5 బిజినెస్ హెడ్ అనురాధ మాట్లాడుతూ .. ‘‘మేము కాప్’లం’’ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని.. ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుందన్నారు. కోడి పందెంలు, సంక్రాంతి సీజన్, గ్రామీణ వాతావరణాన్ని చూపించినట్టుగా వెల్లడించారు.
డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ .. ‘‘మేము కాప్’లం’ సిరీస్‌ను ప్రతీ ఒక్కరి సపోర్ట్‌తోనే ఇంత వేగంగా పూర్తి చేయగలిగామన్నారు. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన శోభన్, చాణక్య, కిశోర్, సెల్వ, సాకేత్ ఇతర టెక్నీషియన్లకు, ఆర్టిస్టులందరికీ థాంక్స్. ఈ జర్నీలో అండగా నిలిచిన బీవీఎస్ రవి, కౌముది, అనురాధకు థ్యాంక్స్ చెప్పారు. ఈ జర్నీలో నాగబాబు అండగా నిలిచారని.. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్‌కి ఈ స్థాయి వచ్చిందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ కొమండురి మాట్లాడుతూ .. ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌కి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ చెప్పారు. నటుడు రవితేజ మాట్లాడుతూ .. గత ఏడాది నాకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని... దీనావస్థ స్థితిలో ఉన్నప్పుడు బీవీఎస్ రవి వచ్చి తనను, శోభన్‌ను పైకి తీసుకు వచ్చారన్నారు. గెటప్ శ్రీను మాట్లాడుతూ .. క్రమశిక్షణ ఉంటేనే ఇక్కడ ఉండగలమని... బీవీఎస్ రవి అందరినీ ఒకే రకంగా చూస్తుంటారన్నారు. ప్రదీప్ గారికి ప్రతీ ఫ్రేమ్, ప్రతీ క్రాఫ్ట్ మీద క్లారిటీ ఉంటుంది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ అని చెప్పారు.