Vihari: ఇకపై ఓటీటీ రంగంలోకి ‘విహారి’..
ఇది ఓటీటీ టైమ్. దీనికి ఆదరణ పెరిగి.. వెండితెరకు తగ్గిపోతోంది. ఈ క్రమంలోనే కొత్త కొత్త ఓటీటీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. జూన్‌లో తెలుగు తొలి ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఒకటి ప్రారంభం కానుంది.
ఇది ఓటీటీ టైమ్. దీనికి ఆదరణ పెరిగి.. వెండితెరకు తగ్గిపోతోంది. ఈ క్రమంలోనే కొత్త కొత్త ఓటీటీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. జూన్‌లో తెలుగు తొలి ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఒకటి ప్రారంభం కానుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా 'బిగ్ బాస్' ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి ఓటీటీ’ గ్లోబల్ విజన్ ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విహారి ఓటీటీ టీమ్ ప్రత్యేక ప్రివ్యూను విడుదల చేసింది. దీంతో తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్రావెల్ స్టోరీల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
18 ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాలతో విహారి ఎంతోమంది ప్రేక్షకులను అలరిస్తోంది. ఈక్రమంలోనే ప్రస్తుతం గ్లోబల్ ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా మారనుంది. తెలుగు మీడియా ట్రావెల్ షోలలో విహారి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, రుచులు, ప్రత్యేకతలను ప్రేక్షకులకు చేరవేసింది. బుల్లితెపై ఇప్పటికే అద్భుతమైన ప్రయాణం సాగిస్తున్న విహారి.. ఇక ముందు ఓటీటీ రూపంలో మరింత విస్తృతంగాప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు భాషలో ట్రావెల్‌కు మాత్రమే అంకితమైన విహారి ఓటీటీ జూన్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.