‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లింప్స్ విడుదల చేసిన వేణు ఉడుగుల
టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథ విడుదలకు సిద్ధమవుతోంది. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ‘సింగిల్ రాజు’ చిత్రం తెరకెక్కుతోంది. యువ దర్శకుడు ఎస్ఎస్. వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథ విడుదలకు సిద్ధమవుతోంది. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ‘సింగిల్ రాజు’ చిత్రం తెరకెక్కుతోంది. యువ దర్శకుడు ఎస్ఎస్. వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విభిన్నమైన టైటిల్‌తో ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం 'మా ఈవెంట్స్' సహకారంతో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు, నిర్మాత వేణు ఉడుగుల ముఖ్య అతిథిగా హాజరై ‘సింగిల్ రాజు’ టైటిల్ పోస్టర్‌తో పాటు గ్లిమ్స్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ.. ఎస్ఎస్. వర్మ, విశ్వస్ ఇద్దరూ తనకు ఎంతో ఇష్టమని... ఈ సినిమా కథ వినగానే చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించిందన్నారు. ఎంతో ధృడ సంకల్పంతో ఈ సినిమాను ప్రారంభించారన్నారు. చిత్ర యూనిట్ మొత్తం చాలా కష్టపడి పని చేస్తోందని... ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్టు వేణు ఉడుగుల తెలిపారు. దర్శకుడు ఎస్ఎస్. వర్మ మాట్లాడుతూ.. వేణు ఉడుగుల సపోర్ట్ లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదన్నారు. ఈ సినిమా కోసం తనకంటే ఎక్కువగా తన తల్లిదండ్రులు కష్టపడ్డారన్నారు. ప్రేక్షకులను తప్పకుండా అలరించే మంచి ఎంటర్‌టైనర్‌గా ‘సింగిల్ రాజు’ నిలుస్తుందనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.
హీరో విశ్వస్ మాట్లాడుతూ.. దర్శకుడు ఎస్ఎస్ వర్మతో కలిసి తాము ఎంతో ఫ్యాషన్‌తో ఈ సినిమాను చేస్తున్నామన్నారు. విలేజ్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ అందరూ సపోర్ట్ చేశారన్నారు. హీరోయిన్లు మౌనిక, దివ్య మాట్లాడుతూ.. సినిమా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. విలేజ్ బ్యాక్ గ్రౌండ్‌లో జరిగే కథలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయన్నారు. టైటిల్ లోగోలో కనిపిస్తున్న ‘బ్రోకెన్ హార్ట్’ ఎమోజీని బట్టి ఈ చిత్రం యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విశేషాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.