Varun Tej: వరుణ్ తేజ్ మోకాలికి తీవ్ర గాయం.. సర్జరీ చేసిన వైద్యులు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రానికి మేకర్స్ ‘బరి’ అనే టైటిల్ ఇచ్చారు. రీసెంట్‌గానే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం వెంటనే పట్టాలెక్కేసింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రానికి మేకర్స్ ‘బరి’ అనే టైటిల్ ఇచ్చారు. రీసెంట్‌గానే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం వెంటనే పట్టాలెక్కేసింది. సినిమా షూటింగ్‌లో భాగంగా వరుణ్ తేజ్ వాలీ బాల్ ఆటను ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్ర గాయమైంది. వెంటనే వైద్యులు వరుణ్ తేజ్‌కు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ విషయాన్ని నిహారిక తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
‘మా అన్నయ్య వరుణ్ తేజ్‌తో మేం రూపొందిస్తోన్న ‘బరి’ సినిమా కోసం వాలీబాల్‌ను ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్ర గాయమైంది. తాజాగా ఆయన్ని పరిశీలించిన డాక్టర్స్ మోకాలికి ఆపరేషన్ చేశారు. ఈ శస్త్ర చికిత్సను వైద్యులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశారు. ప్రస్తుతం వరుణ్ అన్నయ్య వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని భావిస్తున్నాం. ఈ సమయంలో మాకు అండగా నిలబడి ప్రేమాభిమానాలు చూపించిన వారందరికీ ధన్యవాదాలు’ అని నిహారిక పేర్కొన్నారు.