Entertainment

CASTE: 17 ఏళ్ల తర్వాత నలుగురితో కలిసి..

మనం చేసే పనిని బట్టి కులాన్ని నిర్ణయించే రోజుల్లో అంతా బాగుండేదన్నారు. కానీ ఎప్పుడైతే మనిషి పుట్టుకను బట్టి కులాన్ని నిర్ణయించడం మొదలైందో అప్పటి నుంచే పరిస్థితులు మారిపోయాయన్నారు.

CASTE: 17 ఏళ్ల తర్వాత నలుగురితో కలిసి..

వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘CASTE’. ఏకే జంపన్న దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. గతంలో నలుగురితో కలిసి ‘హ్యాపీ డేస్’ సినిమా చేశామని... 17 ఏళ్ల తర్వాత తిరిగి నలుగురితో కలిసి ‘CASTE’ సినిమా చేయబోతున్నట్టు తెలిపాడు. కథ విన్నప్పుడు కొత్తగా.. డిఫరెంట్‌గా అనిపించిందని.. దీనిలో తన క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలిపాడు.

గగన్ బాబు మాట్లాడుతూ.. ‘పుష్ప’ సినిమా తనను చాలా మందికి చేరువ చేసిందని.. తనకు అవకాశం ఇచ్చిన అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపాడు. ఈ సినిమాలో తనకు అద్భుతమైన క్యారెక్టర్ దక్కిందని.. ఇంతమంది మంచి ఆర్టిస్టుల మధ్యలో అవకాశం రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. సత్యం రాజేష్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని సెన్సిటివ్ పాయింట్‌తో డైరెక్టర్ గారు ఈ కథను అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపాడు. వరుణ్ సందేశ్ చాలా కొత్తగా కనిపిస్తాడని.. తన లవర్ బాయ్ ఇమేజ్‌కు ఈ చిత్రంలోని పాత్ర భిన్నంగా ఉంటుందని తెలిపాడు.

రవి మాట్లాడుతూ.. తాను యాంకర్ రవిగా అందరికీ తెలుసని.. ఎప్పటినుంచో యాక్టర్ రవిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నానని తెలిపాడు. ఈ సినిమా కథ చెప్పగానే తనకు చాలా నచ్చిందని.. ఒక పెద్ద సినిమా చేస్తున్న అనుభవం ఈ సినిమా ఇచ్చిందన్నాడు. డైరెక్టర్ ఏకే జంపన్న మాట్లాడుతూ.. మనం చేసే పనిని బట్టి కులాన్ని నిర్ణయించే రోజుల్లో అంతా బాగుండేదన్నారు. కానీ ఎప్పుడైతే మనిషి పుట్టుకను బట్టి కులాన్ని నిర్ణయించడం మొదలైందో అప్పటి నుంచే పరిస్థితులు మారిపోయాయన్నారు. కులం అనేది మనిషికి, మనిషికి మధ్య ఒక అడ్డు గోడగా మారిందన్నారు. ఈ సినిమాను చాలా కమర్షియల్‌గా చెబుతున్నానని.. మీకు చాలా రోజులు గుర్తుండిపోతుందని నమ్ముతున్నానన్నారు.

నిర్మాత కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఇది తమ బ్యానర్‌లో వచ్చిన తొలి సినిమా అని పేర్కొన్నారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని.. వరుణ్ సందేశ్ హీరోగా, కశికా కపూర్, దివి హీరోయిన్స్‌గా నటించారన్నారు. సినిమాలో నాగబాబు, పృథ్వి కీలక పాత్రలు పోషించారని తెలిపారు. ఎక్కడా ఇబ్బంది పడకుండా అందరూ చాలా సహకరించారని.. సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. ఈ సినిమా 90% షూటింగ్ పూర్తయ్యిందని.. జూన్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 16, 2026 1:34 PM