Entertainment

CM Vijay: విజయ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన దర్శకుడు

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్టార్ హీరో విజయ్‌కు అదిరిపోయే బహుమతి అందింది. దర్శకుడు వెంకట్ ప్రభు, విజయ్ కాంబోలో ‘ది గోట్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ ఓ కారును వినియోగించారు.

CM Vijay: విజయ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన దర్శకుడు

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్టార్ హీరో విజయ్‌కు అదిరిపోయే బహుమతి అందింది. దర్శకుడు వెంకట్ ప్రభు, విజయ్ కాంబోలో ‘ది గోట్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ ఓ కారును వినియోగించారు. ఆ కారు నంబర్ ప్లేట్ వచ్చేసి ‘TN07CM2026’. ఈ నంబర్ ప్లేట్ మధ్యలో ‘CM’ అని ఉంది. దీంతో విజయ్ సీఎం అవుతారని ఆ నంబర్ ప్లేటుతో ముందుగానే చెప్పారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంకట్ ప్రభు.. మర్యాదపూర్వకంగా సీఎం విజయ్‌ను కలిసి ఫ్రేమ్ కట్టించిన సదరు నంబర్ ప్లేటును బహుమతిగా అందజేశారు.

ఈ ఫొటోలను వెంకట్‌ ప్రభు ఎక్స్‌ వేదికగా షేర్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా వెంకట్ ప్రభు ఓ పోస్ట్ కూడా పెట్టారు. విజయ్‌ చరిత్ర సృష్టించారని.. మన ముఖ్యమంత్రి విజయ్ అన్నను కలిసి అపురూప కానుకను (నంబర్ ప్లేట్‌ను) ప్రెజెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని వెంకట్ ప్రభు పేర్కొన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. TN07CM2026’’ అని రాసుకొచ్చారు. మే 10న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. మరోవైపు, విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ 2026 ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 19, 2026 4:26 AM