‘చెన్నై లవ్ స్టోరీ’ టీం సమక్షంలో ఘనంగా ఎస్‌కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్
కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎఫ్‌ఎన్‌సీసీలో ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ టీమ్ సమక్షంలో సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.
కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎఫ్‌ఎన్‌సీసీలో ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ టీమ్ సమక్షంలో సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ధీరజ్ మొగిలినేని, డైరెక్టర్ రవి నంబూరి, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఎస్కేఎన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. మా మిత్రుడు ఎస్‌కేఎన్ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలన్నారు. ఏడాదికి రెండు చిత్రాలు నిర్మించాలని... ఇండస్ట్రీకి మంచి హిట్ సినిమాలు అందించాలన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఎస్‌కేఎన్ ప్రతి పుట్టినరోజును ఇలాగే గ్రాండ్‌గా జరుపుకోవాలన్నారు. ఆయన నుంచి మరిన్ని సక్సెస్ పుల్ మూవీస్ రావాలని ఆకాంక్షించారు. ఆయన టైమింగ్‌లో ఎలాంటి మార్పూ ఉండకూడదన్నారు. ఇంకా మరింత ఎనర్జీతో ఆయన కెరీర్ కొనసాగించాలని కోరుకుంటున్నానన్నారు. కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. తాను జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి... పీఆర్ఓగా పనిచేశాననన్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా ఈ వేదిక మీద నిలబడ్డానన్నారు. ఈ జర్నీలో ప్రతి సందర్భంలో జర్నలిస్ట్ మిత్రులు తనకు తోడుగా నిలిచారన్నారు. మీరు లేకుండా తన సక్సెస్ లేదని.. బేబి కల్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మూడేళ్ల తర్వాత ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అనే క్లాసిక్‌తో మీ ముందుకు రాబోతున్నానని తెలిపారు.
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ.. ఎస్‌కేఎన్ ఇలాగే ప్రతి పుట్టినరోజు హ్యాపీగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మరెన్నో మంచి చిత్రాలు నిర్మించాలన్నారు. డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. తన మిత్రుడు ఎస్‌కేఎన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 24న చెన్నై లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని ఎస్‌కేఎన్‌కు మంచి బర్త్ డే గిఫ్ట్ ఇస్తామన్నారు. హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ.. మనం మంచి మూవీస్ చేద్దామని గతంలో తనకు ఎస్‌కేఎన్ చెప్పేవారన్నారు. ఆయన చెప్పినట్లే మంచి మూవీస్ చేస్తున్నారన్నారు. ఎస్‌కేఎన్ ఇంకా గ్రాండ్ బర్త్ డే ఈవెంట్స్ జరుపుకోవాలని.. అలాగే ఆయన నిర్మించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ఘన విజయం సాధించాలన్నారు.