షూటింగ్ పూర్తి చేసుకుని.. డబ్బింగ్ ప్రారంభించిన ‘అంతర్యామి’
ఒడిషా సూపర్ స్టార్ బాబుషాన్ మొహంతి, అందాల నటి వేద్విక సోని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంతర్యామి’. శివ సత్యం దర్శకత్వంలో విభిన్న కథతో ఈ చిత్రం రూపొందింది.
ఒడిషా సూపర్ స్టార్ బాబుషాన్ మొహంతి, అందాల నటి వేద్విక సోని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంతర్యామి’. శివ సత్యం దర్శకత్వంలో విభిన్న కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని నిర్మాత జ్ఞానరంజన్ సాహు నిర్మించిన ఈ చిత్రానికి అమృత్ నిషాద్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఆసక్తికర టైటిల్ మాత్రమే కాకుండా విభిన్నమైన కథతో, ఆసక్తికరమైన కథనం, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో కస్తూరి, ఆమని, రవికుమార్, శ్రీతం దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె. గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీజే కార్తికేయన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అశోక్ బోయిన ఎడిటర్‌గా, బుస్సా బాలరాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వహించారు.