Entertainment

Trikala: 29న విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’

భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’. ఈ చిత్రం మే 29న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రధాన పాత్రలో హీరోయిన్ శ్రద్ధదాస్ నటిస్తుండగా.. మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో నటించారు.

Trikala: 29న విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’

భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’. ఈ చిత్రం మే 29న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రధాన పాత్రలో హీరోయిన్ శ్రద్ధదాస్ నటిస్తుండగా.. మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో నటించారు. మణి తెల్లగూటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమాను చాగంటి ప్రొడక్షన్ LLP ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనుంది.

ఇటీవలి కాలంలో మైథలాజికల్ టచ్‌తో వచ్చిన థ్రిల్లర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ‘త్రికాల’పై అంచనాలు పెరుగుతున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన హైక్వాలిటీ వీఎఫ్‌ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన బలం కానుందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అలాగే మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అజయ్ పవర్‌ఫుల్ పాత్ర, శ్రద్ధాదాస్ కొత్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ… ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ తిరుగుతోందని అన్నారు. భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా తెలిపారు. ప్రేక్షకులకు ‘త్రికాల’ ఒక కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉందని మణి తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ… సరికొత్త కాన్సెప్ట్‌తో, మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ‘త్రికాల’ ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆసక్తి.. వంటి అంశాలు కలిసిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇస్తుందన్నారు. సినిమాకు హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రి రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది. హిందీ శాటిలైట్ హక్కులతో పాటు డబ్బింగ్ రైట్స్‌ ఫ్యాన్స్ రేటుకు అమ్ముడు పోయింది.

టాలీవుడ్‌లో శ్రద్ధదాస్ ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, తరువాత ‘ఆర్య 2’ ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. అనంతరం ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’, ‘డిక్టేటర్’, ‘నాగవల్లి’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ‘త్రికాల’తో మరోసారి విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. మొత్తంగా మైథలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ‘త్రికాల’ మే 29న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 17, 2026 1:04 PM