Entertainment

Allu Arjun: అల్లు అర్జున్‌పై నెట్టింట రూమర్స్.. స్పందించిన అల్లు అరవింద్..

ప్రస్తుతం అల్లు అర్జున్ గురించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ప్రస్తుతం ‘రాకా’ మూవీ షూటింగ్ దాదాపుగా ముంబైలోనే జరుగుతోంది. తరచుగా బన్నీ ముంబై టు హైదరాబాద్ తిరుగుతున్నాడు.

Allu Arjun: అల్లు అర్జున్‌పై నెట్టింట రూమర్స్.. స్పందించిన అల్లు అరవింద్..

అల్లు అర్జు ‘పుష్ప’ సిరీస్.. అట్లీ ‘జవాన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాక వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం ‘రాకా’. అసలు ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ఒకరకమైన క్రేజ్ ప్రారంభమైంది. ఆ తరువాత అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో తెలిపింది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ గురించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ప్రస్తుతం ‘రాకా’ మూవీ షూటింగ్ దాదాపుగా ముంబైలోనే జరుగుతోంది. తరచుగా బన్నీ ముంబై టు హైదరాబాద్ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ముంబైలోనే ఒక ఇల్లు తీసుకుని ఉండాలనుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆయన ముంబైకి షిఫ్ట్ అవబోతున్నారని.. అక్కడ ఇల్లు కూడా కొనేశాడని కొందరు.. ఒక లగ్జరీ విల్లాను రెంట్‌కు తీసుకున్నాడని కొందరు చెప్పుకుంటున్నారు.

ఈ వార్తలపై తాజాగా అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. అల్లు అర్జున్ ముంబయికి షిఫ్ట్​ అవుతున్నాడన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని... ఆయన పిల్లలు హైదరాబాద్‌లోనే చదువుతున్నారని, ఇల్లు, సన్నిహితులు, కుటుంబం అంతా ఇక్కడే ఉండటం వలన ఆయన హైదరాబాద్‌ను వీడే ఆలోచనే లేదన్నారు. ఇక ‘రాకా’ విషయానికి వస్తే.. ఈ సినిమా ఒక విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. అలాగే లోలా వీఎఫ్ఎక్స్, స్పెక్ట్రల్ మోషన్, ఐరన్‌హెడ్ స్టూడియోస్ వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాయి. అలాగే ఈ చిత్రంలో దీపికా పదుకొణె నటిస్తుండటంతో పాటు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కేమియో రోల్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా అలరించనున్నారు. అలాగే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సైతం ఈ సినిమాలో భాగమవుతున్నట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అసలు ఆమె పాత్రపై ఎలాంటి క్లారిటీ లేదు కానీ నెగిటివ్ రోల్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే మాత్రం సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేయాలని అట్లీ పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. సినిమాను తొలుత ఈ ఏడాది చివరి నాటికి రిలీజ్ చేయాలని భావించారు కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ భారీగా ఉంది. దీంతో ఈ ఏడాది విడుదలయ్యే ఛాన్సే లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్‌లో కానీ.. లేదంటే ‘దసరా’ను కానీ టార్గెట్ చేసే అవకాశం ఉంది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 22, 2026 2:51 AM