RK Deeksha: అందరినీ ఇన్స్పైర్ చేసేలా ‘ఆర్కే దీక్ష’
కిరణ్, ఢీ జోడి ఫేమ్ అక్సాఖాన్, అలేఖ్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్కే దీక్ష’. ఆర్కే ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రాన్ని డీఎస్ రెడ్డి సమర్పించారు.
కిరణ్, ఢీ జోడి ఫేమ్ అక్సాఖాన్, అలేఖ్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్కే దీక్ష’. ఆర్కే ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రాన్ని డీఎస్ రెడ్డి సమర్పించారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ జోష్‌ను పెంచేశారు. తాజాగా దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్ర సాంగ్స్ , టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత ఎ. గురురాజ్ మాట్లాడుతూ.. ‘ఆర్కే దీక్ష’ చిత్రాన్ని ఎంతో క్వాలిటీగా రూపొందించారని సాంగ్స్, టీజర్ చూస్తేనే తెలుస్తోందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. పొలిటికల్ లీడర్ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ.. సిద్ధిపేట ప్రాంతం నుంచి వచ్చిన డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ రాజకీయంగా, సినీ రంగంలో ఎంతోకాలంగా కొనసాగుతున్నారన్నారు. ఆయన అనేక చిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించి,. నటుడిగానూ రాణించారన్నారు. ‘ఆర్కే దీక్ష’ చిత్రం కూడా ఆయనకు సక్సెస్ అందించాలన్నారు. కెనడా వాసి తరుణ్ సాహి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉందన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇచ్చిన డా. ప్రతాని రామకృష్ణ గౌడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. హీరో కిరణ్, హీరోయిన్ అక్స ఖాన్ తమ పాత్రల్లో జీవించారని... ఈ చిత్రంలో మంచి సంగీతం అందించినట్టుగా తెలిపారు. బీసీ సంఘం నేత అంజలి మాట్లాడుతూ.. డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ గతంలో మంచి మూవీస్ చేశారన్నారు. ‘దీక్ష’ చిత్రం కూడా అందరినీ ఇన్స్పైర్ చేసేలా ఉండబోతోందని.. సాంగ్స్, టీజర్ ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు. విశ్రాంత న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమాలు వినోదంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉండాలన్నారు. సామాజానికి మంచి చేయాలని... అలాంటి మంచి ప్రయత్నాన్ని ‘ఆర్కే దీక్ష’ చిత్రంతో చేస్తున్నారన్నారు.
హీరో కిరణ్ మాట్లాడుతూ.. డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఎంతోమంది కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారని.. దీక్ష, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం అని చెప్పే చిత్రమిదన్నారు. రాజ్ కిరణ్ సంగీతం మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందన్నారు. రోయిన్ అక్స ఖాన్ మాట్లాడుతూ.. ఈ రోజు విడుదల చేసిన సాంగ్, టీజర్ అందరికీ నచ్చాయని నమ్ముతున్నామన్నారు. మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమిదన్నారు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేశానని పేర్కొన్నారు. చిత్ర సమర్పకులు డీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి సందేశాన్ని అందిస్తుందని.. మన వీర జవాన్ల సాహసాలపై రూపొందించిన స్పెషల్ సాంగ్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందన్నారు.
ఫైట్ మాస్టర్ రవి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఫైట్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని... ఆర్కే గౌడ్ ఎంతోమంది ఫైటర్స్‌కు ఉచితంగా మెంబర్‌షిప్‌లు ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారన్నారు. నటి తులసి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఫ్రెండ్ పాత్రలో నటించానని.. మన సైనికుల ధైర్యసాహసాలను చెప్పేలా రూపొందించిన పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి మనిషిలో దీక్ష, పట్టుదల ఉంటాయి. వాటితో పనిచేస్తే ఏదైనా సాధించగలమని చెప్పే చిత్రమిదన్నారు. వీర జవాన్ మురళీనాయక్ గొప్పతనాన్ని తెలియజేసేలా ఒక స్పెషల్ సాంగ్ రూపొందించినట్టుగా పేర్కొన్నారు. జూన్ 12న విడుదల కానున్న ‘ఆర్కే దీక్ష’ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ.. డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ సినిమాపై ప్యాషన్ ఉన్న వ్యక్తి. వీర జవాన్ సాహసాన్ని చెప్పే పాటను థ్రిల్లింగ్‌గా రూపొందించారన్నారు. ఈ చిత్రంలో మంచి కంటెంట్ ఉంది. కిరణ్, అక్సా ఇద్దరూ చాలా బాగా నటించారన్నారు.