జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నూతన చిత్రం ప్రారంభం
లార్క్ స్టూడియోస్, ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ తమ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ‘కరుడన్’, ‘మామన్’ తరువాత లార్క్ స్టూడియోస్ రూపొందిస్తున్న మూడో చిత్రమిది.
లార్క్ స్టూడియోస్, ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ తమ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ‘కరుడన్’, ‘మామన్’ తరువాత లార్క్ స్టూడియోస్ రూపొందిస్తున్న మూడో చిత్రమిది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘జో’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన హరిహరన్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
జీవీ ప్రకాష్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌లో హీరో కావడమే కాకుండా సంగీతం కూడా అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సరికొత్తగా కనిపించనున్నారు. 'జో' చిత్రంలో నటించి మెప్పించిన మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'కర్ణన్', 'వాళై' వంటి చిత్రాలలో తన విజువల్స్‌తో ఆకట్టుకున్న తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన పూర్తి విశేషాలను మేకర్స్ తెలియజేయనున్నారు. ఈ చిత్రం జూన్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటికే లొకేషన్ల అన్వేషణ జరుగుతోంది.