Entertainment

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గ్లోబల్ స్థాయి మూవీకి క్లాప్ కొట్టిన నాని..

ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు హీరో విజయ్ దేవరకొండ ఓ స్టెప్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘హాయ్ నాన్న’ ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్‌తో విజయ్ దేవరకొండ హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గ్లోబల్ స్థాయి మూవీకి క్లాప్ కొట్టిన నాని..

ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు హీరో విజయ్ దేవరకొండ ఓ స్టెప్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘హాయ్ నాన్న’ ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్‌తో విజయ్ దేవరకొండ హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. నేడు శౌర్యువ్, విజయ్ కాంబోలో రూపొందనున్న చిత్రానికి లాంఛనంగా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు జరిగాయి. వైరా బ్యానర్ ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తుండగా... ముహూర్తపు సన్నివేశానికి నేచురల్ స్టార్ నాని క్లాప్ ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమాకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పని చేస్తుండటం విశేషం. అంతేకాకుండా గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్ చిత్రాల వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్.. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇండియన్ సినిమాకు గ్లోబల్ స్థాయి క్రేజ్ తీసుకురావడంలో వారణాసి, రాకా చిత్రాల్లా విజయ్ శౌర్యువ్ మూవీ కూడా ప్రయత్నిస్తోంది. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రా‌ప్‌లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 20, 2026 1:30 PM