Raghu Kunche: నాకే వాడిని చంపాలన్నంత కోపం వచ్చింది..
ఇక సినిమాలో తన క్యారెక్టర్ విషయానికి వస్తే భయపెట్టేలా ఉండాలని.. దాని కోసం 12 కేజీల బరువు పెరిగినట్టుగా రఘు కుంచె వివరించారు. మైత్రీ శశి కూడా అప్పట్లో తను చేసిన టీవీ ప్రోగ్రామ్స్ చూసి సాఫ్ట్‌గా ఉంటానని అనుకున్నానని.. కానీ భయపెట్టారని అన్నారన్నారు.
రఘు కుంచె టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి విడుదలైన అప్‌డేట్స్ అన్నీ మంచి సక్సెస్ సాధించాయి. మోటూరి టాకీస్ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహిస్తుండగా.. వాణి రవికుమార్ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రఘు కుంచె మీడియాతో ముచ్చటించారు.
తాను యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా గతంలోనూ కొన్ని చిత్రాలకు పనిచేశానని.. కానీ తనకు "గేదెల రాజు" సినిమా సమ్ థింగ్ స్పెషల్ అనిపించిందన్నారు. సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో నటించడంతో సినిమాపై కమాండ్ ఏర్పడిందన్నారు. మూవీలో బీజీఎం చాలా నేచురల్‌గా ఉంటుందన్నారు. అప్పట్లో శివ, గీతాంజలి లాంటి మూవీస్ మనం గమనిస్తే పెరుగు మీద మీగడలా క్యారెక్టర్‌ను బీజీఎం మరింత అందంగా చేసేదన్నారు. తన చిత్రంలో కూడా బీజీఎం విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నట్టు రఘు తెలిపారు. క్యారెక్టర్‌ను ఎక్కడా బీజీఎం డామినేట్ చేయకుండా, సెటిల్డ్‌గా కంపోజ్ చేసినట్టు తెలిపారు. పాటలు కూడా కథను ముందుకు నడిపించేలా సిట్యువేషనల్ గా ఉంటాయి. మూడు సాంగ్స్‌లో ఒకటి తాను పాడగా.. మరొకటి బేబక్క, ఇంకోటి మంగాదేవి పాడారని తెలిపారు.
ఇక సినిమాలో తన క్యారెక్టర్ విషయానికి వస్తే భయపెట్టేలా ఉండాలని.. దాని కోసం 12 కేజీల బరువు పెరిగినట్టుగా రఘు కుంచె వివరించారు. మైత్రీ శశి కూడా అప్పట్లో తను చేసిన టీవీ ప్రోగ్రామ్స్ చూసి సాఫ్ట్‌గా ఉంటానని అనుకున్నానని.. కానీ భయపెట్టారని అన్నారన్నారు. సినిమా చూసిన వాళ్లంతా తన క్యారెక్టర్‌పై ప్రరశంసలు కురిపించారన్నారు. నైజాంలో మైత్రీ వాళ్లు 100కు పైగా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారని.. ఏపీ తెలంగాణలో కలిపి 200 స్క్రీన్స్, అలాగే ఓవర్సీస్ లో 60 లొకేషన్స్ లో మా సినిమా రిలీజ్ అవుతోందన్నారు. ఈ సినిమాలో మ్యాటర్ అయితే ఉంది కానీ వీళ్ల దగ్గర మూటలు లేవన్నారు. డైరెక్టర్ చైతన్య సినిమా కోసం చాలా కష్టపడ్డాడని.. ప్రతి డిపార్ట్ మెంట్ దగ్గరుండి చూసుకునేవాడన్నారు. సినిమా పట్ల వీళ్లకున్న ప్యాషన్ చూసి ప్రొడక్షన్‌లో తాను కూడా భాగమైనట్టు వెల్లడించారు.
సహజంగా తాను ప్రతి సినిమాకు వందశాతం ఎఫర్ట్స్ పెడుతుంటానన్నారు. ఈ సినిమాకు ఇంకాస్త తన అవసరం ఉందనిపించి.. ప్రెజెంటర్‌గా మారినట్టు రఘు కుంచె తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర గోదావరి జిల్లా యాసలో మాట్లాడాలని.. తాను గోదావరి జిల్లా వాడిని కాబట్టి ఈ క్యారెక్టర్‌లో నటించడం సులువైందన్నారు. బరువు పెరిగి, పొట్టతో రెడీ అయిన తనకు ఆ పాత్ర ఆవహించేసిందన్నారు. ఈ సినిమాను రియల్ లొకేషన్స్‌లో షూట్ చేసినట్టుగా రఘు తెలిపారు. మఉక్యంగా ఫిష్ మార్కెట్‌లో చేసిన సీన్స్‌లో అక్కడి వాళ్లంతా వాళ్ల పనులు చేసుకుంటూ సహజంగా తమ మూవీలో కనిపించారన్నారు. ఇంటర్వెల్ ఫైట్ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందన్నారు. ఒక సీన్ లో భాగంగా ఫిష్ మార్కెట్‌లో రాత్రంతా ఉండాల్సివచ్చిందని.. నటుడిగా హ్యాపీగా ఉండే సినిమాలే కాదు.. ఇలా కష్టపడే సందర్భాలూ వస్తాయని అప్పుడు తనకు అనిపించిదన్నారు. గెదెలరాజు క్యారెక్టర్‌ను డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం చూస్తుంటే తనకే వాడిని చంపాలనిపించేంత కోపం వచ్చిందని రఘు కుంచె అన్నారు.