Entertainment Breaking News

Sumanth Prabhas: ఫ్రెండ్స్ ఆ మాట అన్నప్పుడు మనసు కళుక్కుమంది..

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘గోదారి గట్టుపైన’ సమ్మర్‌లో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించారు.

Sumanth Prabhas: ఫ్రెండ్స్ ఆ మాట అన్నప్పుడు మనసు కళుక్కుమంది..

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘గోదారి గట్టుపైన’ సమ్మర్‌లో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించారు. మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం సమ్మర్ కూల్ ఎంటర్టైనర్‌గా అలరించి థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. మూడేళ్ల తర్వాత తన సినిమా వస్తోంది కాబట్టి.. ‘ఎవరైనా టికెట్ కొంటారా?’ అని తన ఫ్రెండ్స్ అన్నప్పుడు మనసు కాస్త కళుక్కుమందని తెలిపాడు. కానీ తాము థియేటర్లు విజిట్ చేస్తూ పల్లెటూర్లలో తిరిగినప్పుడు కనిపించిన ఎనర్జీ మామూలుగా లేదన్నారు. ఫ్యామిలీలతో థియేటర్లు కళకళలాడడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ‘మేం ఫేమస్’ సినిమాను యూత్ కనెక్ట్ చేసుకున్నారని... ఈ సినిమా తనకు కొత్త ఆడియన్స్‌ను పరిచయం చేసిందన్నారు. ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లిందన్నారు. హీరోయిన్ నిధి ప్రదీప్ మాట్లాడుతూ.. మాయ క్యారెక్టర్‌కు వస్తున్న రెస్పాన్స్ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొంది. ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. సుమంత్‌తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందని.. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపింది.

నిర్మాత అభినవ్ రావు మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్‌తో తాము చాలా ఆనందంగా ఉన్నామని తెలిపారు. ఇంకా సినిమా చూడని వారు ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడాలన్నారు. థియేటర్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోందని... సెకండ్ వీక్ నుంచి సినిమా మరింత పెరిగిందన్నారు. డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. సచిన్ టెండూల్కర్.. ‘ఎవరైనా రాళ్లు విసిరితే, ఆ రాళ్లతోనే మైయిలురాయి చేసుకోండి ’ అని అన్నారని.. అలా ‘గోదారి గట్టుపైన’ తమకు అలాంటి మైలు రాయి అని పేర్కొన్నారు. 10 రోజుల్లో 8.6 కోట్ల గ్రాస్ సాధించడం మాకు చాలా గొప్ప విషయమన్నారు. ఇది పూర్తిగా ప్రేక్షకుల వల్లే సాధ్యమైందన్నారు.

దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. నిర్మాతలు లాభాల దిశగా సాగుతుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. సుమంత్ ప్రభాస్, నిధి అందరూ అద్భుతంగా నటించారు. సుమంత్ ప్రభాస్, జగపతిబాబు, లైలా కూడా ఎంతో చక్కగా పెర్ఫార్మ్ చేశారు. సుదర్శన్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో చిన్న సినిమా సూపర్ హిట్ అవ్వడం, నిలబడడం చాలా కష్టమని.. అలాంటిది ఈ సినిమాకు ఫ్యామిలీలు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తున్నాయన్నారు. నిన్న కూడా చాలా థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయన్నారు. ఇలాంటి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 18, 2026 1:43 PM