Entertainment

Gayapadda Simham: ఇండియా-అమెరికాకు వార్ తీసుకొచ్చిన కశ్యప్..

చిన్నప్పటి నుంచి జేడీ గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన మరిన్ని సినిమాలతో మమ్మల్ని ఇన్‌స్పైర్ చేయాలి. ఈ సినిమాలో నేను చేయడానికి ఒక కారణం నారా రోహిత్ కూడా. ఆయన నా సినిమాల్లో చాలాసార్లు క్యామియో చేశారు

Gayapadda Simham: ఇండియా-అమెరికాకు వార్ తీసుకొచ్చిన కశ్యప్..

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'గాయపడ్డ సింహం'. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్‌లో నటిస్తున్నారు. పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించగా.. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ విసా స్టాపింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీరామ్ ఆదిత్య, సాయి మార్తాండ, హుస్సేన్ షా కిరణ్, హసిత్ గోలి, సందీప్ రాజ్, నటి గీతా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘గాయపడ్డ సింహం’ టీమ్‌కి కంగ్రాచులేషన్స్. ఇక్కడికి విజయ్, పవన్ కోసం వచ్చాను. విజయ్‌తో నాకు చాలా కాలంగా అసోసియేషన్ ఉంది. అలాగే పవన్‌తో ఇదే బ్యానర్‌లో నెక్ట్స్ సినిమా చేస్తున్నా. ఈ సినిమా ఒక మెమొరబుల్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నా. మే 1న అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి” అన్నారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘‘విప్లవ్ ఎడిటింగ్.. స్వీకర్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. పాటలు, బీజీఎమ్ అదిరిపోయాయి. మానస నా సినిమాలో క్యామియో చేసింది కాబట్టి, నేను కూడా తన సినిమాలో చేశాను (నవ్వుతూ). డైరెక్టర్ కశ్యప్‌కి ఉన్న ప్రత్యేకమైన టైమింగ్‌ను ఈ సినిమాలో బాగా వాడుకున్నారు. చిన్నప్పటి నుంచి జేడీ గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన మరిన్ని సినిమాలతో మమ్మల్ని ఇన్‌స్పైర్ చేయాలి. ఈ సినిమాలో నేను చేయడానికి ఒక కారణం నారా రోహిత్ కూడా. ఆయన నా సినిమాల్లో చాలాసార్లు క్యామియో చేశారు (నవ్వుతూ)’’ అన్నారు.

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు ఫస్ట్ హీరో పవన్ సాదినేని. ఆయన ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు ప్రొడ్యూసర్లు లేరు. కానీ నాకు, తరుణ్‌కి చెప్పిన తర్వాత సినిమా స్టార్ట్ చేయగా.. మధ్యలో కొన్ని సమస్యలు వచ్చాయి. అయితే కశ్యప్ వెనుక నిలబడ్డాడు . ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ చేసిన క్యారెక్టర్, ట్రంప్‌తో పెట్టుకున్న గొడవ వల్ల నా క్యారెక్టర్... నాకు తెలియకుండా శ్రీ విష్ణు క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. కశ్యప్ ఇండియా–అమెరికాకు వార్ తీసుకురాగలిగాడు(నవ్వుతూ). శ్రీ విష్ణు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో కనిపిస్తారు’’ అన్నారు.

డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘నా గాడ్ బ్రదర్ పవన్ సాదినేని. నేను భవిష్యత్తులో ఏ విజయాలు సాధించినా, దాని క్రెడిట్ పవన్‌కే దక్కుతుది. ఈ వేడుకకు వచ్చిన నారా రోహిత్‌కి ధన్యవాదాలు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో డెడికేషన్‌తో వర్క్ చేశారు. సినిమా మీద ప్యాషన్ ఉన్న మా నిర్మాతలకు డబ్బులు వస్తే, నా లాంటి వాళ్లకు లైఫ్ వస్తుంది. స్వీకర్ అగస్తి తన బెస్ట్ మ్యూజిక్ ఇచ్చి సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లగా... జేడీ, తరుణ్ ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘‘ఇందులో నాకు మంచి వైబ్ ఉన్న పాత్ర దక్కింది. డైరెక్టర్ కశ్యప్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అదిరిపోతుంది. మానస ఈ సినిమాలో చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఎంటర్టైన్‌మెంట్ ఈ సినిమా ఇస్తుంది’’ అన్నారు.

హీరోయిన్ మానస చౌదరి మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకు విచ్చేసిన దర్శకులకు, నారా రోహిత్ గారికి, శ్రీవిష్ణు గారికి ధన్యవాదాలు. మా నిర్మాతలందరికీ థాంక్స్. తరుణ్ భాస్కర్ గారు నా ఫేవరెట్ డైరెక్టర్. ఇందులో ఆయన పెర్ఫార్మెన్స్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. జేడీ గారు ఈ సినిమాకు మంచి వైబ్ తీసుకొచ్చారు. ఫారియా యాక్టింగ్‌తో పాటు డాన్స్ కూడా చాలా క్యూట్‌గా ఉంటుంది. డైరెక్టర్ కశ్యప్ గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి సీన్‌లో ఫన్ ఉంటుంది. కడుపుబ్బ నవ్వుకుంటూ బయటికి వస్తారు.

మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తి మాట్లాడుతూ... నన్ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకువచ్చిన భాను గారికి థాంక్స్. ఇలాంటి కమర్షియల్ సినిమా కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. మా నిర్మాతలందరికీ ధన్యవాదాలు. డైరెక్టర్ కశ్యప్ గారు నాకు ఈ సినిమా కోసం చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయన టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. మా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్స్. శ్రీ విష్ణు గారి డబ్బింగ్ కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాం. ఆయన డబ్బింగ్ వినడానికి మ్యూజిక్ పనులు కూడా ఆపేసి ప్రత్యేకంగా విన్నాం. ఆయన ఈ సినిమాలో భాగం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.

ప్రొడ్యూసర్ సందీప్ మాట్లాడుతూ.. ‘కశ్యప్ ఈ సినిమాను అద్భుతంగా తీస్తే.. దానికి స్వీకర్ అగస్తి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తరుణ్ పెర్ఫార్మెన్స్ చాలా స్పెషల్’ అన్నారు. ప్రొడ్యూసర్ భాను కిరణ్ మాట్లాడుతూ.. ‘‘పవన్ ఈ కథ చెబుతుంటే విన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను. జేడీ గారు, శ్రీ విష్ణు గారు కథ విని స్నేహంతో ముందుకు వచ్చి చేశారు. ఈవెంట్‌కు నారా రోహిత్ గారు రావడం ఆనందంగా ఉంది. తరుణ్ అద్భుతంగా నటించాడు’’ అన్నారు. ప్రొడ్యూసర్ పవన్ సాదినేని మాట్లాడుతూ.. ‘‘కశ్యప్ చెప్పిన ఐడియా నాకు చాలా నచ్చడంతో ముందుకు తీసుకెళ్లాం. కశ్యప్ డ్రీమ్‌ను నిజం చేసేందుకు నలుగురు ఫ్రెండ్స్ కలిసి వచ్చాం. ఈ సినిమా మొత్తం ఫ్రెండ్షిప్ వైబ్‌తో ఉంటుంది’’ అన్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 29, 2026 9:20 AM