Pawan Kalyan: పవన్‌కు శస్త్ర చికిత్స అందుకేనా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆపరేషన్ నిర్వహించారన్న వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అసలు ఆయనకు ఏం జరిగింది? ఎందుకు సర్జరీ చేశారనేది విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆపరేషన్ నిర్వహించారన్న వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అసలు ఆయనకు ఏం జరిగింది? ఎందుకు సర్జరీ చేశారనేది విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి మోదీకి శస్త్ర చికిత్స నిర్వహించారు అని మాత్రమే జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది తప్ప ఎందుకు అనేది మాత్రం ప్రకటనలో పేర్కొనలేదు. శుక్రవారం అధికారిక సమావేశంలో పవన్ ఉండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. వెంటనే ఆయనను ఆసుపత్రిగా తీసుకెళ్లగా పలు పరీక్షలు నిర్వహించిన మీదట వైద్యులు సర్జరీ అవసరమని తేల్చారని పేర్కొన్నారు.
శస్త్రచికిత్స నుంచి కోలుకుని రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి పది రోజులు పడుతుందని.. ఆ తరువాత కూడా పరిస్థితి నార్మల్ అవడానికి మరికొంత కాలం పడుతుందని వైద్యులు తెలిపారు. అసలు అంతలా పవన్‌కు ఏం జరిగింది? అనేది చర్చనీయాంశంగా మారింది. పేర్కొంటూ.. ఆయన పూర్తి ఆరోగ్యం సంతరించుకోవడానికి చాలా రోజులు పడుతుందని ప్రస్తావించడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అయితే పవన్ గత కొంతకాలంగా వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఒకానొక సమయంలో ఆయన కనీసం నిలబడలేని, కూర్చోలేని పరిస్థితిని సైతం ఎదుర్కొన్నారు. కాబట్టి ప్రస్తుతం సర్జరీ దీనికే జరిగిందంటూ ఒక టాక్ అయితే నడుస్తోంది. మరి వాస్తవానికి వెన్ను సమస్యకేనా? లేదంటే మరేదైనా సమస్యా? అనేది తెలియరాలేదు.