Entertainment Breaking News

Manchu Manoj: నేనేమీ సూపర్ మ్యాన్ కాదు.. అందుబాటులో ఉండలేను.. అందుకే ‘ఐక్య’

టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న మంచు మనోజ్ పుట్టినరోజు నేడు.

Manchu Manoj: నేనేమీ సూపర్ మ్యాన్ కాదు.. అందుబాటులో ఉండలేను.. అందుకే ‘ఐక్య’

టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న మంచు మనోజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం నాడు కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. తన ఐక్య ట్రస్ట్, తన సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం వంటి విషయాల గురించి ఆయన మాట్లాడారు.

వాయిస్ లెస్‌కి వాయిస్‌గా..

తానేమీ సూపర్ మ్యాన్ కాదని.. అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చన్నారు. అందుకే ఐక్య ట్రస్ట్‌ను పెట్టాలని అనుకున్నామన్నారు. వాయిస్ లెస్‌కి వాయిస్‌గా ఈ ట్రస్ట్ ఉంటుందని మనోజ్ తెలిపారు. అలా ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పెట్టడానికి చాలా కారణాలున్నాయన్నారు. ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని... విభజించుకుంటూ వెళ్తే చివరకు ఏమీ మిగలదనే ఉద్దేశంతో ఐక్య అని పెట్టినట్టు తెలిపారు. అలాగే తన కొడుకు పేరు ధైరవ్ అని.. కూతురు పేరు దేవ సేన అని.. ఇలా అందరి పేర్లు కలిపి ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పెట్టినట్టుగా మనోజ్ తెలిపారు. ఈ ట్రస్ట్ కూడా తమకు ఓ బిడ్డ లాంటిదేనన్నారు.

త్వరలోనే రక్షక్..

‘ఐక్య’కి ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని... ఎప్పటి నుంచో ఇలాంటి ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని అనుకున్నామని మంచు మనోజ్ తెలిపారు. దానికి సంబంధించిన నియమాల్ని ఇంకా రూపొందించలేదని.. తాము ప్రస్తుతం అదే పనిలో ఉన్నామన్నారు. కావాల్సిన నిధి కోసం మేం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. జూన్ 7న తన కొత్త సినిమా ‘రక్షక్’ ప్రారంభం కాబోతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా సాధికారత నేపథ్యంలో ‘రక్షక్’ చిత్రం ఉంటుందని.. దానిలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్టు తెలిపారు. ఆ మూవీ ప్రారంభోత్సవం నాడే ‘ఐక్య’కి సంబంధించిన అన్ని విషయాల్ని అధికారికంగా ప్రకటిస్తానని.. అంతలోపు ‘ఐక్య’ కోసం మీడియా వారి నుంచి కూడా సలహాలు తీసుకుంటానని వెల్లడించారు.

కొత్తగా రాజకీయాల్లోకి..

తనకు సినిమాల్లో మళ్లీ పునర్జన్మను ఇచ్చిన విజయ్ కనకమేడలకి, కార్తిక్ ఘట్టమనేనికి జీవితాంతం రుణపడి ఉంటానని మనోజ్ తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల పాత్రల్ని చేయాలని అనుకుంటున్నాననని... కెరీర్ ప్రారంభం నుంచీ ఇప్పటి వరకూ ప్రతీ స్క్రిప్ట్, కథని తానే విని ఓకే చేశానని.. ఇప్పుడు కూడా తనే విని.. తనకు నచ్చిన కథల్నే చేస్తానని స్పష్టం చేశారు. నా వృత్తిపరమైన జీవితంలోకి నా భార్య గానీ, ఆమె వృత్తిపరమైన జీవితంలోకి తాను కానీ వెళ్లబోమన్నారు. మేం పరస్పరం ఆ విషయంలో ఒకరినొకరిని గౌరవించుకుంటామన్నారు. మేం పుట్టినప్పటి నుంచీ రాజకీయాల్లోనే ఉన్నామన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి రావడం అని ఏముంది. వచ్చే ఎన్నికల్లో తన భార్య పోటీ చేస్తారన్నారు. తన పుట్టిన రోజుని తారక్ అన్నతో, స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. సిరివెన్నెలకి అంతం అంటూ ఉండదన్నారు.

వీసా ప్రాబ్లం..

తాను దాని గురించి ప్రత్యేకంగా చెప్పేకంటే రేపు (మే 20) సాయంత్రం గ్లింప్స్ రాబోతోందని.. మాటల కంటే మన పని చెబితేనే బెటర్ అన్నారు. షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయిందని.. హనుమా రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ చేస్తున్నారన్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ మధ్యే షూటింగ్ చేసి వచ్చామన్నారు. ‘వాట్ ది ఫిష్’ ఇప్పుడు రావడం లేదని... అనుకోని కారణాల వల్ల అది కుదరలేదన్నారు. తాను, సత్య, వెన్నెల కిషోర్ అందరం కలిసి చేయాల్సిన సినిమా. చివరి నిమిషంలో చాలా మందికి వీసా ప్రాబ్లం వచ్చిందన్నారు. స్క్రిప్ట్ బాగుందని.. కానీ మిగిలిన అన్ని పరిస్థితులు కూడా కలిసి రావాలి కాబట్టి ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలన్నారు. ‘మోహన రాగ మ్యూజిక్’ చాలా బాగా వస్తుందన్నారు. అద్భుతమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, సింగర్లు పని చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు నాలుగు పాటలు రికార్డ్ అయ్యాయని.. మరో నాలుగు పాటలు రెడీ కావాల్సి ఉందన్నారు. ఇంకో రెండు, మూడు నెలల సమయం పట్టేలా ఉందన్నారు.

ఐదారు ప్రాజెక్టులు..

‘నమస్తే వరల్డ్’ టాయ్స్ గురించి మంచు మనోజ్ మాట్లాడుతూ.. తన సతీమణి మౌనిక ‘నమస్తే వరల్డ్’ టాయ్స్ గురించి పని చేస్తున్నారన్నారు. త్వరలోనే బెంగళూరులో, రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారన్నారు. ఆమెకు తాను జస్ట్ సపోర్ట్‌గా ఉంటున్నానన్నారు. ప్రస్తుతం తన చేతిలో ఐదారు ప్రాజెక్టులున్నాయి. వాటికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఈ నెలలోనే వస్తాయన్నారు. ప్రతీ హీరో నుంచి కంటిన్యూగా సినిమాలు రావాలని కోరుకుంటున్నానన్నారు. తాను కూడా వరుసపెట్టి చిత్రాలు చేయాలనే ప్లానింగ్‌లోనే ఉన్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని మంచు మనోజ్ తెలిపారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 20, 2026 5:52 AM