First Time Movie Review: ‘ఫస్ట్ టైమ్’ మూవీ ఎలా ఉందంటే..
హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని.. దర్శకత్వం, నిర్మాత బాధ్యతలు స్వీకరించి రూపొందించిన చిత్రం ‘ఫస్ట్ టైమ్’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రంపై మాట్లాడటంతో ఒక పాజిటివ్ నోట్ ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది.
హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని.. దర్శకత్వం, నిర్మాత బాధ్యతలు స్వీకరించి రూపొందించిన చిత్రం ‘ఫస్ట్ టైమ్’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రంపై మాట్లాడటంతో ఒక పాజిటివ్ నోట్ ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది. దీనికి తోడు ట్రైలర్ కూడా హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? చిన్న సినిమాకు ఎంత పెద్ద విజయం దక్కనుంది? చూద్దాం.
కథేంటంటే..
భూమిపైకి ఏలియన్స్ రావడం.. భూగోళంపై తమ సంతతిని విస్తరించాలనుకోవడంతో కథ ఆరంభమవుతుంది. మరోవైపు ఆద్య (అనికా విక్రమన్) ఇంజినీరింగ్ చదువుతూ ఉంటుంది. అదే కాలేజ్‌లో ఉండే రాహుల్ (శివకుమార్) ఆమెను ఎలాగైనా సొంత చేసుకోవాలని ఆరాటపడుతుంటాడు. ఆద్యను వివాహం చేసుకోవాలని ఆమె బావ అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు. కానీ ఆద్యకు తన బావ అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. కుటుంబ సభ్యులు ఆద్యకు ఇష్టం లేకున్నా బలవంతంగా అతనితో ఎంగేజ్‌మెంట్ జరిపిస్తారు. ఆ తరువాత ఆమె ఆది (అఖిల్ సార్థక్)తో ప్రేమలో పడుతుంది. ఈ క్రమంలో ఆద్య బావ.. రాహుల్‌ను బెదిరించి ఆది, ఆద్యల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు. ఆ తరువాత ఆద్య బావ ఏం చేశాడు? బావ, రాహుల్.. ఆదిల మధ్య ఆద్య కథ చివరకు ఏమవుతుంది? మరోవైపు మనుషులంతా మరణిస్తూ ఉంటారు? అసలలా ఎందుకు జరుగుతుంది? అంతమంది మరణిస్తున్నా బయటకు ఏమాత్రం ఆ న్యూస్ పొక్కకుండా చూసుకుంటున్నదెవరు? అసలు భారత దేశం.. భారత ప్రపంచం అనడం వెనుక కారణమేంటి? కథతో ఆస్ట్రోనాట్స్, ఏలియన్స్‌కు సంబంధం ఏమిటి? వంటి అంశాల గురించి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
ఇదొక సైన్స్ ఫిక్షన్ కథగానూ.. న్యూ ఏజ్ చిత్రంగానూ అనిపిస్తూ ఉంటుంది. చాలా చిన్న బడ్జెట్‌లో హేమంత్ ఇప్పలపల్లి ఒక ఆసక్తికర ప్రపంచాన్ని సృష్టించారు. 2304లో అంటే దాదాపు 300 ఏళ్ల తర్వాత ప్రస్తుతమున్న కలియుగం అంతమైతే పరిస్థితి ఏంటన్న ఆలోచనతో ఈ సినిమాను రూపొందించారు. ముఖ్యంగా మూడు అంశాలతో కథ నడిపించిన తీరు ఆసక్తికరం. ఆస్ట్రోనాట్స్, ఏలియన్స్‌ను కథలో ఇన్వాల్వ్ చేయడం అనేది ఇప్పటి వరకూ జరగలేదు. ఇలాంటి కాన్సెప్ట్ అనేది చాలా అరుదు. రాజమౌళికి ఏకలవ్య శిష్యుడినని చెప్పుకునే హేమంత్ ఒక అద్భుతమైన భారత ప్రపంచాన్ని తయారు చేయాలనే వినూత్న ఆలోచన చేయడం.. దానిని సినిమాగా రూపొందించడం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. విజువల్స్‌తో ఒక వండర్ క్రియేట్ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా కొన్ని కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలను కోల్పోయారు. అంతకు పదింతల మహమ్మారి వస్తే పరిస్థితేంటి? భూమిపై జీవకోటి మొత్తం నశిస్తే.. కలియుగం అంతమైపోతుంది. అప్పుడు సత్యయుగం ప్రారంభానికి దర్శకుడు బాటలు వేయడమనేది చాలా ఆసక్తికరం. ఒక ఫిక్షనల్ స్టోరీని దర్శకుడు అద్భుతంగా ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను ఆక్టుకుంటుంది.
ఎవరెలా నటించారంటే..
హీరో సౌరభ్ థింగ్రా తన పాత్రలో లీనమై నటించారు. అఖిల్ సార్థక్ సైతం తన పాత్రలో జీవించారు. హీరోయిన్ అనికదే ఈ చిత్రంలో కీలక పాత్ర. ఆమె తన పాత్రలో జీవించేసింది. శివ, అజయ్ రత్నం, గాయత్రీ గుప్తా, భూపాల్ రాజు, అన్నపూర్ణమ్మ తదితరులు త పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
టెక్నికల్ పరంగా సినిమా గురించి గొప్పగా చెప్పాలి. దర్శకుడి ఇన్నోవేటివ్ థాట్‌కి నిలువెత్తు నిదర్శనమీ చిత్రం. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. సంగీతం విషయానికి వస్తే పాటలు పర్వాలేదనిపించాయి.
ఫైనల్‌గా.. ‘ఫస్ట్ టైమ్’ ఒక విజువల్ వండర్
రేటింగ్: 3/5