Entertainment

Manchu Manoj: నాన్న దగ్గరకు మైక్‌తో వెళ్లకండి.. వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి

మంచు మనోజ్ రేపు (మే 20) పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన నేడు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే తన తండ్రి మంచు మోహన్‌బాబుతో గొడవల గురించి మీడియా ఆయనను ప్రశ్నించగా..

Manchu Manoj: నాన్న దగ్గరకు మైక్‌తో వెళ్లకండి.. వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి

రా కింగ్ స్టార్ మంచు మనోజ్ రేపు (మే 20) పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన నేడు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే తన తండ్రి మంచు మోహన్‌బాబుతో గొడవల గురించి మీడియా ఆయనను ప్రశ్నించగా.. ఆ ప్రశ్న ఎవరిని అడగాలో మీకు తెలుసని అన్నారు. కానీ ఆయన (మంచు మోహన్‌బాబు) వద్దకు మైక్‌తో వెళ్లవద్దని.. ఒకవేళ వెళ్లినా కూడా హెల్మెట్ పెట్టుకుని వెళ్లాలని సరదాగా చెప్పారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో తన సేవా కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు ఆయన ఇటీవల ఐక్య సంస్థను (AIKYA Dhairya Sena Samithi) ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై ఉన్న పలు సందేహాలపై ఆయన స్పష్టతనిచ్చారు.

గతంలో తన ఇంటి వద్ద ఓ టీవీ ఛానల్ రిపోర్టర్‌ను మోహన్‌బాబు మైకుతో కొట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మనోజ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఐక్య ధైర్య సేనా సమితి గురించి మంచు మనోజ్ మాట్లాడుతూ.. అది రాజకీయ సంస్థ కాదన్నారు. రాజకీయాలకు ఈ సంస్థకూ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల గొంతుకగా ఉండేందుకు దీన్ని ప్రారంభించినట్లు సైతం మనోజ్ వెల్లడించారు. సంస్థ కార్యకలాపాల కోసం విరాళాల సేకరణ వంటివేం చేయబోమని.. సొంత నిధులనే వెచ్చించనున్నట్లు తెలిపారు. అలాగే, తన సతీమణి మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా వెల్లడించారు. ఇప్పుడు తాము రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడమేంటని మనోజ్ ప్రశ్నించారు. ఎప్పటి నుంచో తాము రాజకీయాల్లో కొనసాగుతున్నట్టు తెలిపారు.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 19, 2026 12:11 PM