Entertainment

Blast Zone Review: అర్జున్ ‘బ్లాస్ట్ జోన్’తో బ్లాస్ట్ చేశారా?

చాలా కాలం తర్వాత అర్జున్ సర్జా ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా ట్రైలర్ తర్వాత అంచనాలు బాగానే పెరిగాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం.

Blast Zone Review: అర్జున్ ‘బ్లాస్ట్ జోన్’తో బ్లాస్ట్ చేశారా?

చిత్రం: బ్లాస్ట్ జోన్

విడుదల: 28-05-2026

నటీనటులు: అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి, వివేక్ ప్రసన్న, జాన్ కొక్కేన్ తదితరులు

దర్శకుడు: సుభాష్ కె రాజ్

నిర్మాతలు: కల్పాతి ఎస్. అఘోరమ్, కల్పాతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్

సంగీతం: రవి బస్రూర్

సినిమాటోగ్రఫీ: అరుణ్ రాధాకృష్ణన్

ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ

చాలా కాలం తర్వాత అర్జున్ సర్జా ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా ట్రైలర్ తర్వాత అంచనాలు బాగానే పెరిగాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే..

కరాటేలో ఛాంపియన్‌ అయిన రాజారామ్‌ (అర్జున్‌ సర్జా).. భార్య నీలవేణి (అభిరామి), కూతురు నీలా (ప్రీతి ముకుందన్), తమ్ముడు (వివేక్ ప్రసన్న)తో కలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. రాజారామ్ కరాటే ఇన్‌స్టిట్యూట్ నడిపిస్తూ ఉండగా.. వీరికి ఉన్న మెడికల్ షాపును నీల బాబాయి నడిపిస్తూ ఉంటాడు. నీలవేణి కూడా కరాటేలో ఛాంపియన్. తన కూతురును కూడా రాజారామ్.. కరాటేలో ఛాంపియన్‌ను చేస్తాడు. అలాగే ఆమెకు విలువలను సైతం నేర్పిస్తాడు. మరోవైపు ఏడు వేల కోట్ల మైనింగ్ కోసం ఇండస్ట్రియలిస్ట్ అయిన వరుణ్‌(జాన్ కొక్కేన్)తో స్థానిక ఎమ్మెల్యే డీల్ కుదుర్చుకుంటాడు. దీని కోసం ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ట్రస్ట్‌కి వెయ్యి కోట్ల రూపాయలను చెల్లించాల్సి వస్తుంది. దీంతో వరుణ్.. రంగంలోకి అండర్ వరల్డ్ డాన్ అబ్రహం (అర్జున్ చిదంబరం) దింపుతాడు. అబ్రహం వెయ్యి కోట్లను ఒక వంద నోటుకి కన్వర్ట్ చేసి దానిని దుబాయ్‌లో మార్చాలని చెబుతాడు. సడెన్‌గా అబ్రహంకు యాక్సిడెంట్ అవడం.. అతను పోలీసులకు చిక్కడం చకచకా జరిగిపోతాయి. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. ఆ తరువాత కథ ఏం జరిగింది? అబ్రహం వెయ్యి కోట్లు తీసుకున్నాడా? అసలు అబ్రహం, వరుణ్ లైఫ్‌లోకి రాజారామ్ కుటుంబం ఎలా ఎంటర్ అవుతుంది? పోలీ

సినిమా ఎలా ఉందంటే..

అన్యాయం జరుగుతుంటే ఎదిరించాలని.. అక్కడ ఉన్నది తనవారా? పరాయివారా? అనేది చూసుకోకూడదని.. నీలకు రాజారామ్ చెప్పి పెంచుతాడు. ఆమె అన్యాయం జరిగితే ఎదుర్కొంటూ ఉంటుంది. సినిమా గురించి చెప్పాలంటే.. స్క్రీన్‌ప్లే, బీజీఎం గురించి చెప్పాలి. సినిమాలో పాటలు కానీ, కడుపుబ్బ నవ్వించే కామెడీ సన్నివేశాలు కానీ ఏమీ లేవు. అయినా కూడా ఎక్కడా బోర్ అనిపించదు. స్క్రీన్‌ప్లే అంత గ్రిప్పింగ్‌గా ఉంది. ఇక బీజీఎం అయితే రవి బస్రూర్ అదరగొట్టేశారు. ఫస్ట్ హాఫ్ అంతా రాజారామ్ కుటుంబం.. మెడికల్ షాపు చూపిస్తూనే విలన్ ఎంట్రీ.. ఏడు వేల కోట్ల మైనింగ్ కోసం ఒక గ్రామాన్నే నాశనం చేయాలనుకోవడం వంటి అంశాలను చూపించారు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో నెరేషన్.. సెకండ్ హాఫ్ మాత్రం వేగం పుంజుకోవడంతో పాటు ఆసక్తికరంగా సినిమా నడుస్తుంది. కొన్ని సన్నివేశాలు మనకు అతిగా అనిపిస్తాయి. అయినా కూడా స్క్రీన్‌ప్లే మనల్ని ఆ ఆలోచన రాకుండా చేస్తుంది.

ఎవరెలా చేశారంటే..

అర్జున్‌కి చాలా కాలం తర్వాత మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ దొరికింది. కూతురిని ట్రైన్ చేస్తూ.. గైడ్ చేస్తూ ఒక మంచి తండ్రిగానే కాకుండా.. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టారు. ఇక ప్రీతిముకుందన్ విషయానికి వస్తే.. చాలా అందంగా కనిపించడంతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించింది. అభిరామి.. ఒకవైపు తల్లిగా కూతురు గురించి ఆందోళన చెందుతూనే.. అవసరమైనప్పుడు సపోర్ట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అర్జున్ చిదంబరం, వివేక్ ప్రసన్న, జాన్ కొక్కేన్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు సుభాష్‌కు ఇది తొలి సినిమా అయినా కూడా ఎక్కడా తడబడకుండా సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించారు. స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రాణం. రాజారాం కుటుంబం, పోలీసులు, విలన్స్.. ఒకరికొకరికి ముడి పెట్టిన తీరు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇక బీజీఎం కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది.

ఫైనల్‌గా.. ‘బ్లాస్ట్ జోన్’తో అర్జున్ బ్లాస్ట్ చేశారు.

రేటింగ్: 3/5

ప్రజావాణి చీదిరాల

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 28, 2026 9:42 AM