Dhanush Kara Teaser: కరసామి మీద పడిన మచ్చేంటి?
‘‘పంటో గడ్డో.. పాపమో పుణ్యమో.. తను నాటింది.. తనే నరుక్కోవాలి. నేను నాటిన విత్తనం ఇప్పుడు కోత కొచ్చింది. అంత కంటే ముందు నామీద పడ్డ మచ్చని తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి. నా పేరు కరసామి’’
క్రేజీ టైటిల్స్‌తో.. ఆకట్టుకునే కథాంశంతో హీరో ధనుష్ ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ప్రస్తుతం కూడా అదే పని చేస్తున్నాడు. ‘కర’ అనే చిత్రంతో ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘‘పంటో గడ్డో.. పాపమో పుణ్యమో.. తను నాటింది.. తనే నరుక్కోవాలి. నేను నాటిన విత్తనం ఇప్పుడు కోత కొచ్చింది. అంత కంటే ముందు నామీద పడ్డ మచ్చని తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి. నా పేరు కరసామి’’ అని టీజర్‌లో ధనుష్ తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. అసలు కరసామి మీద పడిన మచ్చేంటి? తనకు ఎదురైన సమస్య నుంచి కరసామి ఎలా బయటపడ్డాడనేది ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందినట్టుగా టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ధనుష్ పాత్రలో చాలా వేరియేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.