Chiru158: ఊహించని థ్రిల్లిచ్చిన చిరు 158.. పండగ చేసుకున్న మెగా ఫ్యాన్స్
చిరు158 నేడు లాంఛనంగా ప్రారంభమైంది. బాబీకొల్లి, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రూపొందనున్న ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతోప్రారంభమైంది. ఇవాళ (గురువారం, మే 21) జరిగిన ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్స్ చాలా ఉన్నాయి.
చిరు158 నేడు లాంఛనంగా ప్రారంభమైంది. బాబీకొల్లి, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో గతంలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు వీరిద్దరి కాంబోలో రెండో చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో #chirubobby2 ప్రారంభమైంది. ఇవాళ (గురువారం, మే 21) జరిగిన ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు హాజరయ్యారు. చాలా కాలం తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబును ఒకే ఫ్రేంలో చూడగలిగే భాగ్యం మెగా ఫ్యాన్స్‌కు దక్కింది. అది చూసిన ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఇక రెండో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే.. చిరు సినిమాకు పవన్ క్లాప్ కొట్టారు. అన్నయ్య సినిమాకు తమ్ముడు క్లాప్ కొట్టడమనేది ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చే మూమెంట్‌గా మారింది. ఇక ముచ్చటగా మూడో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే.. ఈ కార్యక్రమంలో చిరు, పవన్‌లకు కప్పిన షాల్. దానిలో ఏముందిలే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. షాల్‌పై చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఫోటోలను గోల్డ్ థ్రెడ్‌తో రూపొందించారు. ఆ షాల్ చూడముచ్చటగా ఉంది. మెగా ఫ్యాన్స్‌కైతే వాస్తవానికి ఇది పండగే. అడుగడునా ఆసక్తికరంగా చిరు 158 మూవీ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. ఫ్యాన్స్‌కు ఊహించని థ్రిల్ పంచింది. దీంతో ఆది నుంచే సినిమాపై అంచనాలు ప్రారంభమయ్యాయి. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
