Kiran abbavaram: చాట్ బస్టర్‌గా ‘చెన్నై లవ్ స్టోరీ’ పాటలు..
ఫస్ట్ సింగిల్ 'తొలి ప్రేమేం తోపు కాదే..' ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక తాజాగా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ 'వదలనే..' పాట కూడా ఇన్‌స్టంట్‌గా మంచి సక్సెస్ అయ్యింది.
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా రూపొందుతున్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ కాంబోలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు సాయి రాజేశ్ కథను అందిస్తుండగా.. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ఆదరణతో ఛాట్ బస్టర్స్ గా మారుతున్నాయి.
ఫస్ట్ సింగిల్ 'తొలి ప్రేమేం తోపు కాదే..' ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక తాజాగా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ 'వదలనే..' పాట కూడా ఇన్‌స్టంట్‌గా మంచి సక్సెస్ అయ్యింది. ఇలా రిలీజ్ చేసిన ప్రతి పాట ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సినిమా మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్ జర్నీ చేస్తోంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే జూలైలో ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.