Allu Arjun: ‘రాకా’లో ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం డైలీ 4 అవర్స్ శ్రమిస్తున్న బన్నీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రాకా’. ఈ సినిమా నుంచి ఇటీవల అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఇటీవలే ఒక పోస్టర్ బయటకు వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రాకా’. ఈ సినిమా నుంచి ఇటీవల అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఇటీవలే ఒక పోస్టర్ బయటకు వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సరిహద్దులను దాటి కొత్త స్థాయికి తీసుకెళ్లే విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌డ్ మూవీగా నిలవబోతుందని దేశమంతటా చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నయా లుక్ అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. ఆన్‌లైన్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ముఖ్యంగా ఇటీవల విడుదలైన పోస్టర్‌లో బన్నీ చేతితో చూపిస్తోన్నస్టైల్ వైరల్ అయ్యింది. నెట్టింట చాలా మంది దానిని రీక్రియేట్ చేస్తున్నారు. ఇటీవల ఇండియన్ స్టార్ క్రికెటర్ హార్దిక పాండ్య కూడా ఓ ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ఆ స్టైల్‌ను రీ క్రియేట్ చేయటం విశేషం. ఈ లుక్, దాని ఇంటెన్సిటీ కోసం అల్లు అర్జున్ ఎంతగానో శ్రమించారు.
రెండు దశాబ్దాల తన కెరీర్‌లో అల్లు అర్జున్ ఎంతగానో మారాడు. తన స్టైల్, నటన, మాస్ అప్పీల్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్‌గా మారాడు. ముఖ్యంగా రీసెంట్‌గా రిలీజైన రాకా లుక్ కోసం అల్లు అర్జున్ ప్రతీ రోజూ మూడు నుంచి నాలుగు గంటల పాటు శ్రమిస్తున్నాడని టాక్. ఈ పుష్ప సినిమా సంచలన విజయం తర్వాత అల్లు అర్జున్ తన సినిమాలకు సంబంధించిన నయా లుక్స్ ఉండేలా చూసుకుంటూనే ఇంటెన్స్ ఉన్న పాత్రలను చేయటానికి సిద్ధపడుతున్నాడు. లుక్, స్టైల్, స్వాగ్ ద్వారా ఆయన ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. ‘రాకా’ సినిమాతో ఆయన చేస్తోన్న ఇతర ప్రాజెక్టులపై కూడా ఆసక్తి పెరుగుతోంది. అద్భుతమైన నటన, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ అప్పీల్ వంటి వాటిన్నింటినీ సమన్వయం చేసుకుంటూ అల్లు అర్జున్ ఒక సంపూర్ణ నటుడిగా నిలబడుతున్నారు.