‘అన్ని ఓ గురుతులు’ చిత్రానికి వెల్లువెత్తిన అవార్డులు
పుట్టుకతోనే మన జీవితంలోనే ఎన్నో బంధాలు పెనవేసుకు పోవడంతో పాటు ప్రతీ బంధం ఒక గొప్ప అనుభూతిని ఇవ్వడంతో పాటు తానున్నాననే ధైర్యాన్నిస్తుంది. అలాగే ప్రతీ బంధం నిజమైన తోడుగా ఉంటాననే నమ్మకాన్నిస్తుంది.
వంకాయల దివాకర్, కసం తేజ , మాస్టర్ శ్రీ నిక్షిత్, బేబీ మిక్కీ, నాగరాణి రెడ్డి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘అన్నీ ఓ గురుతులు’. టీఓఎఫ్ టవర్ వన్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సంతోష్ రావ్ సమర్పణలో వెంకట్ చల్లగుండ్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పుట్టుకతోనే మన జీవితంలోనే ఎన్నో బంధాలు పెనవేసుకు పోవడంతో పాటు ప్రతీ బంధం ఒక గొప్ప అనుభూతిని ఇవ్వడంతో పాటు తానున్నాననే ధైర్యాన్నిస్తుంది. అలాగే ప్రతీ బంధం నిజమైన తోడుగా ఉంటాననే నమ్మకాన్నిస్తుంది. కానీ అసలైన తోడు ఎవరనేది తెలిసే సరికి జీవితం చరమాంకానికి వచ్చేస్తుంది. అలా ప్రతి మనిషికి కడ దాకా ఉండే అసలైన తోడు ఎవరనేది చెప్పే ప్రయత్నంలో భాగంగా రూపొందిన చిత్రమే ‘అన్నీ ఓ గురుతులు’
ఈ సినిమా పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో పది అవార్డులను కైవసం చేసుకుని ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పారడైస్ ఫిలిం ఫెస్టివల్, అమెరికా - జనవరి 2026, వరల్డ్ ఇండై ఫిలిం అవార్డ్స్, యూకే - జనవరి - బెస్ట్ ఫిలిం విన్నర్, వరల్డ్ ఫిలిం ఫెస్టివల్, కెన్స్ - విన్నర్ బెస్ట్ ఇండియన్ ఫిలిం, పూంబుకర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ ఫిలింగా అవార్డులను ఈ చిత్రం గెలుచుకుంది. ఇక ఈ చిత్ర దర్శకుడి విషయానికి వస్తే.. జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా అవార్డును గెలుచుకున్నారు. స్వీడెన్ ఫిలిం అవార్డ్స్‌లో ఫైనలిస్ట్‌గా.. టీహెచ్. ఈ ఫిలిం ఫెస్టివల్, అమెరికాలో అధికారికంగా సెలెక్ట్ అయ్యింది. ఫ్లైట్ డెస్క్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో అధికారకంగా సెలెక్ట్ అవడంతో పాటు అన్ని ప్రతిష్టాత్మక ఐఎండీబీ సర్టిఫైడ్ అర్హత పొందాయి.