Entertainment

Mahesh Babu: మహేశ్, త్రివిక్రమ్ సెట్స్‌లో ఎలా ఉంటారో చెప్పిన నటుడు కృష్ణ తేజ

నటుడు కృష్ణ తేజకు తొలి చిత్రంలో వెండితెరపై మెరవబోతున్నానన్న ఆనందం ఒక ఎత్తైతే.. అది సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం కావడం మరో ఎత్తు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ వ్యక్తిత్వం గురించి కృష్ణ తేజ చెప్పుకొచ్చారు.

Mahesh Babu: మహేశ్, త్రివిక్రమ్ సెట్స్‌లో ఎలా ఉంటారో చెప్పిన నటుడు కృష్ణ తేజ

సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడమనేది ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేనివారికైతే అది మరింత కష్టం. ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది. నంద్యాల దగ్గర చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఓ వ్యక్తి.. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు 100 సినిమాల్లో చేసి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆయనే కృష్ణ తేజ. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి చాలా ఆసక్తికర విషయాలను తెలిపాడు. ఆయనకు తొలి చిత్రంలో వెండితెరపై మెరవబోతున్నానన్న ఆనందం ఒక ఎత్తైతే.. అది సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం కావడం మరో ఎత్తు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ వ్యక్తిత్వం గురించి కృష్ణ తేజ చెప్పుకొచ్చారు.

త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబోలో రూపొందిన ‘అతడు’ తన తొలి చిత్రమని కృష్ణ తేజ చెప్పుకొచ్చారు. ప్రకాశ్ రాజ్ సీబీఐ టీం మెంబర్‌గా ఆయన నటించారు. ఈ క్రమంలోనే మహేశ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. మహేశ్ బయట మాదిరిగానే సెట్‌లోనూ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటారని తెలిపాడు. మీడియాలో సెటైరికల్‌గా ఎంత యాక్టివ్‌గా ఉంటారో.. షూటింగ్ సెట్‌లోనూ అంతే యాక్టివ్‌గా ఉంటారని.. చిన్నా, పెద్ద ఆర్టిస్ట్ అనే తేడా లేకుండా అందరితో సెటైర్స్ వేస్తూ కలివిడిగా ఉంటారని కృష్ణ తేజ తెలిపారు. తనకు తొలినాళ్లలో పెద్దగా తెలిసేది కాదని.. కానీ త్రివిక్రమ్‌ ఇతర దర్శకుల్లా కాదన్నాడు. హీరో దగ్గరకు వెళ్లొద్దనే కండీషన్స్ వంటివేమీ ఉండవని తెలిపాడు. త్రివిక్రమ్ సెట్స్‌లో ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని.. కాబట్టి అలా మహేశ్‌కి దగ్గరగా ఉండే అవకాశం తనకు వచ్చిందన్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 26, 2026 12:13 PM