Chiranjeevi: చిరు, బాబీ కొల్లి కాంబో నుంచి అదిరిపోయే అప్‌డేట్..
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబోలో గతంలో వాల్తేర్ వీరయ్య వచ్చి ఎంత మంచి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం మరో మాస్ ఎంటర్‌టైనర్ కోసం ఈ కాంబో జతకట్టింది.
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబోలో గతంలో వాల్తేర్ వీరయ్య వచ్చి ఎంత మంచి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం మరో మాస్ ఎంటర్‌టైనర్ కోసం ఈ కాంబో జతకట్టింది. ఈ చిత్రాన్ని సుప్రసిద్ధ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. #చిరుబాబీ2 / #చిరు158 ఈ నెల 21న అధికారికంగా ప్రారంభం కానుంది. ఇప్పుడు మేకర్స్ టీమ్‌లోకి టెక్నికల్ పరంగా ఇండస్ట్రీలోనే టాప్ టెక్నీషియన్స్‌ను తీసుకుంటున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే అప్‌డేట్ ఒకటి వచ్చింది. ‘జైలర్’, ‘డాకూ మహారాజ్’, అలాగే రాబోయే ‘జైలర్ 2’ చిత్రాలతో తన విజువల్ స్టైల్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ ఈ చిత్రానికి డీవోపీగా అధికారికంగా జాయిన్ అయ్యారు.
విజయ్ కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేయడంతో ఈ అప్డేట్ మరింత స్పెషల్‌గా మారింది. గతంలో బాబీ కొల్లితో ఆయన కలిసి పని చేశారు. ఈసారి తన ప్రత్యేక విజువల్ టచ్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే విడుదలైన లుక్ టెస్ట్ ఇమేజెస్, అనౌన్స్‌మెంట్ పోస్టర్, అలాగే చిరంజీవి జిమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో అన్నీ కలగలిపి ఈ చిత్రంపై అంచనాలను పెంచుతున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న బాబీ కొల్లి, ఈసారి చిరంజీవిని ఇప్పటివరకూ చూడని అత్యంత పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారు. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత ఎలివేట్ చేసేలా ఈ సినిమా రూపొందుతోంది. ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.