మైత్రీ మూవీ మేకర్స్, ప్రశాంత్ నీల్ కాంబోకు క్రేజీ టైటిల్..
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సరికొత్త హారర్ చిత్రం రూపొందనుంది. యంగ్ స్టర్స్‌తో కలసి రూపొందిస్తున్న ఈ చిత్రానికి కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సరికొత్త హారర్ చిత్రం రూపొందనుంది. యంగ్ స్టర్స్‌తో కలసి రూపొందిస్తున్న ఈ చిత్రానికి కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ సమర్పిస్తుండగా.. సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తాజాగా మేకర్స్ ఒక క్రేజీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు.
ఈ హారర్ చిత్రానికి 418 అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమా కథపై క్యూరియాసిటీ పెంచింది. భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజ్ నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. సైన్స్– మిస్టరీ, సైన్స్, మూఢనమ్మకానికీ అర్ధం కాని ఒక సీక్రెట్‌తో ఇప్పటివరకూ చూడని సరికొత్త కథతో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. ఈ చిత్రంలో శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.