Happy Birthday Manchu Manoj: బ్రేక్ తర్వాత బ్లాక్‌బస్టర్ లైఫ్.. మనోజ్ జర్నీ ఆఫ్ రీస్టార్ట్
ఇది మంచు మనోజ్ నటించిన ‘మిస్టర్ నూకయ్య’ చిత్రంలోని పాట. ఈ లైన్స్ ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక క్షణంలో కనెక్ట్ అవుతాయి. మంచు మనోజ్ కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఆ తరువాత కన్నీటిని దాటి అడుగు ముందుకేశాడు. ప్రస్తుతం అంతా సక్సెస్..
ఇది మంచు మనోజ్ నటించిన ‘మిస్టర్ నూకయ్య’ చిత్రంలోని పాట. ఈ లైన్స్ ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక క్షణంలో కనెక్ట్ అవుతాయి. మంచు మనోజ్ కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఆ తరువాత కన్నీటిని దాటి అడుగు ముందుకేశాడు. ప్రస్తుతం అంతా సక్సెస్.. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అద్భుతంగా జీవితాన్ని సాగిస్తున్నాడు. ఇవాళ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ‘Prajasmedia.com’ ప్రత్యేక కథనం..
బ్రేక్ తర్వాత మంచు మనోజ్ బ్లాక్ బస్టర్ లైఫ్ అనుభవిస్తున్నాడు. నటుడు అన్నాక ఏదో ఒక పాత్ర అయితేనే చేస్తానని గిరి గీసుకుని కూర్చోకూడదు. ప్రస్తుతం మంచు మనోజ్ అదే చేస్తున్నాడు. అదే ఆయన సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. హీరో పాత్రలైతేనే చేస్తానంటే పరిస్థితి ఎలా ఉండేదో.. కానీ మనోజ్ ఎప్పుడూ అంటే తన కెరీర్ ప్రారంభంలో కూడా అలాంటి బౌండరీస్ ఏమీ తన చుట్టూ గీసుకోలేదు. దానికి ‘వేదం’ మూవీనే సాక్షి. క్యారెక్టర్ మంచిదైతే చాలు.. చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు.
ఏ ముహూర్తాన ఆ మూవీ చేశాడో కానీ..
అందరి కెరీర్ మాదిరిగానే మంచు మనోజ్ తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. ఎందుకో తెలియదు కానీ ఒకానొక దశలో సినీ కెరీర్‌లో చాలా పెద్ద బ్రేక్ ఇచ్చాడు. కొన్నేళ్ల తర్వాత తిరిగి ‘భైరవం’ సినిమాతో రీఎంట్రీ. ఏ ముహూర్తాన ఆ సినిమా చేశాడో కానీ మనోజ్ లైఫే ఒకరకంగా మారిపోయింది. అప్పటి వరకూ ఉన్న కుటుంబ సమస్యలు అన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ‘మిరాయ్’ మంచి జోష్ ఇచ్చింది. ఇప్పుడు ‘డేవిడ్ రెడ్డి’తో పాటు ఇంకొన్ని సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయిపోయాడు. స్టార్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, తనకంటూ ఓ ప్రత్యేక శైలిని నిర్మించుకున్న నటుడిగా మంచు మనోజ్ అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించాడు. మంచు ఫ్యామిలీలో ఎవరికీ దక్కనంత అభిమానాన్ని ప్రజల నుంచి మంచు మనోజ్ దక్కించుకున్నాడంటే దానికి ఆయన వ్యక్తిత్వమే కారణమని చెప్పాలి.
నో ట్రోల్స్..
మంచు ఫ్యామిలీ ఏదో ఒక సందర్భంలో ట్రోల్‌కు గురైంది. కానీ మంచు మనోజ్ మాత్రం ఏనాడూ.. ఎవరూ ట్రోల్ చేయలేదు. ఆయన కోపంలో ఏదైనా మాట జారినా.. అది కూడా ట్రెండ్ అయ్యింది తప్ప ట్రోల్ అవలేదు. ప్రేక్షకులు ఆయనను అంతలా ఓన్ చేసుకున్నారు. మనోజ్ కూడా ఎప్పుడూ ఎక్కడైనా.. ఎవరితోనైనా సరదాగా ఉంటాడు. ప్రతి ఒక్కరితోనూ ఎలాంటి భేషజం లేకుండా కలిసిపోతాడు. అందుకే ఆయనకు అభిమాన గణం చాలా ఎక్కువ. కెరీర్ పరంగా బిజీ అయినా కూడా సమాజానికి ఏదో చేయాలనే ఒకే ఒక్క ఆలోచనతో తన సతీమణి మౌనికతో కలిసి ‘ఐక్య’ ను ప్రారంభించాడు. దీని ద్వారా ఏం చేయబోతోంది కూడా కొంత బ్రీఫ్ అయితే మనోజ్ తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించాడు. వాయిస్ లేని వారికి ఐక్య వాయిస్ కాబోతోందని తెలిపాడు. రక్తదాన శిబిరంతో పాటు, ఈరోజు నుంచే ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారి విద్యకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్టు ఈ సంస్థను ప్రకటించిన రోజే వెల్లడించాడు. ఇది ఇక్కడితో ఆగదని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామానికీ సేవా కార్యక్రమాలను విస్తరిస్తామన్నారు.
స్నేహితుడి కోసం..
ఇక ఇవాళ మనోజ్ స్నేహితుడు ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా. స్నేహానికి మనోజ్ ఇచ్చే విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్ విషయంలోనే ఇది కూడా మనం చూశాం. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ అంత్యక్రియలకు వెళుతుండగా.. అభిమాన సంద్రం ఆయనను ముందుకు కదలనివ్వలేదు. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు మంచు మనోజ్ బౌన్సర్‌లా మారిపోయాడు. కష్టంలో స్నేహితుడి కోసం నిలబడిపోయాడు. అది మంచు మనోజ్ వ్యక్తిత్వం. ఇక ముందు కూడా మనోజ్ ఎన్నో విజయాలను అందుకోవాలని.. కష్టాలు వచ్చినా కూడా వాటిని దాటుకుంటూ శిఖరంలా ఎదగాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్‌డే మంచు మనోజ్.
ప్రజావాణి చీదిరాల