Razer: వామ్మో అంత వయోలెన్సా? రప్ఫాడించిన రవిబాబు..
ఫార్ములా కథలకు దూరంగా, కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన రవి బాబు ప్రస్తుతం తన తాజా చిత్రం ‘రేజర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఫార్ములా కథలకు దూరంగా, కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన రవి బాబు ప్రస్తుతం తన తాజా చిత్రం ‘రేజర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. అవసరంలో ఉన్నవారికి రక్షణగా ప్రతిసారి భగవంతుడు తను రాలేడు కాబట్టి తన దూతను పంపిస్తాడని చెబుతారు. మరణం వ్యక్తిని వెంటాడుతున్న తరుణంలో ఇక తప్పించుకోవడం అసాధ్యం అనుకుంటున్న తరుణంలో అదే దేవదూత విధ్వంసానికి ప్రతీకగా మారుతుంది.
ఎప్పుడైతే కరుణ మాయమవుతుందో.. అప్పుడు కేవలం ఆగ్రహం మాత్రమే మిలుగుతుంది. ఈ కాన్సెప్ట్‌తో రూపొందినదే ‘రేజర్’. ఈ ట్రైలర్ మొత్తం బీభత్సమైన వయోలెన్స్‌తో నిండిపోయింది. బ్లడ్ వరదలా పారించేశారు. ఈ ట్రైలర్‌ను బట్టి చిత్రంలో రవిబాబు ఒక డాగ్ గ్రూమర్‌గా కనిపించబోతున్నారు ఒక చిన్న అమ్మాయిని కాపాడేందుకు యత్నించే క్రమంలో రవిబాబు అయితే రఫ్ఫాడించారు. ఈ నేపథ్యంలోనే భయంకరమైన యాక్షన్ సన్నివేశాలున్నాయి. రచయిత, దర్శకుడిగా రవి బాబు తన ప్రత్యేక స్టయిల్ ని కొనసాగిస్తూ, ఈసారి అందరికీ మరింత చేరువయ్యేందుకు యాక్షన్, ఎమోషన్ కలగలిపిన కథతో వస్తున్నట్టుగా తెలుస్తోంది.