Lavanya Tripati: ‘సతీ లీలావతి’లో కామెడీని ఎంజాయ్ చేస్తారు
‘సతీ లీలావతి’ మూవీని వరుణ్‌తో కలిసి చూశానని.. చాలా బాగుందని తెలిపారు. ఈ మూవీ షూటింగ్ టైంలోనే తాను ప్రెగ్నెంట్ అని తెలిసిందని.. కానీ టీం ఇచ్చిన సపోర్ట్‌తో షూటింగ్ సాఫీగా చేశానని లావణ్య తెలిపారు.
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య ఈ మూవీకి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌లో జోష్ పెంచేశారు. బుధవారం హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అప్పుడే ప్రెగ్నెంట్ అని తెలిసింది..
‘సతీ లీలావతి’ మూవీని వరుణ్‌తో కలిసి చూశానని.. చాలా బాగుందని తెలిపారు. ఈ మూవీ షూటింగ్ టైంలోనే తాను ప్రెగ్నెంట్ అని తెలిసిందని.. కానీ టీం ఇచ్చిన సపోర్ట్‌తో షూటింగ్ సాఫీగా చేశానని లావణ్య తెలిపారు. ప్రతీ రోజూ షూటింగ్ అయిన తరువాత హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేసుకుంటూ ఉండేదాన్నని పేర్కొన్నారు. ఈ కథ విన్నప్పుడు వరుణ్‌కి చెప్పానని.. అయితే అప్పటికి తనకు ప్రెగ్నెంట్ అని తెలీదని.. కనీసం ఎలాంటి సింప్టమ్స్ కూడా లేవని లావణ్య తెలిపారు. షూటింగ్ కూడా అంత ఈజీ కాదని కొద్ది రోజులకే అర్థమైందని పేర్కొన్నారు. ఈ మూవీ కోసం వెయిట్ కూడా తగ్గానని వెల్లడించారు. ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే మాత్రం షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తానని తెలిపారు.
ఎమోషనల్‌గా ఉంటుంది..
ఈ చిత్రంలో డైరెక్టర్ పాత్రలో కనిపిస్తానని.. ఇందులో ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంటుందని లావణ్య పేర్కొన్నారు. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారని.. తాను, తన మేనేజర్ సినిమా చూస్తూ ఫుల్లుగా నవ్వుకున్నామని తెలిపారు. కొన్ని చోట్ల సినిమా ఎమోషనల్‌గా ఉంటుందని.. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బాగుంటుందని వెల్లడించారు. మంచి మెసెజ్ ఉన్నా కూడా ఏదో బోధిస్తున్నట్టుగా అనిపించదన్నారు. ‘సతీ లీలావతి’లో చూపించినట్టుగా రిలేషన్స్ బయటి ప్రపంచంలో ఉండవని.. అలాంటి పరిస్థితి కూడా ఏ మహిళకీ రాకూడదన్నారు. తనకు రియల్ లైఫ్‌లో వరుణ్ లాంటి మంచి భర్త దొరికారని.. ప్రస్తుతం తను భర్త, కొడుకుతో హ్యాపీగా ఉన్నానని లావణ్య తెలిపారు.
ఏమైనా హెల్ప్ చేయాలా?
తాను ప్రెగ్నెంట్ కదా అని స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని లావణ్య పేర్కొన్నారు. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్‌లో మార్పులు చేశారని వెల్లడించారు. ఫస్ట్ టైం ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ చేశానన్నారు. రామ్ చరణ్ తమకు ఎప్పుడూ సపోర్టివ్‌గానే ఉంటారని.. ఏమైనా హెల్ప్ చేయాలా? కావాలా? అని అడుగుతుంటారని తెలిపారు. మా కోసం ఆయన ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా అనిపించిందని.. రామ్ చరణ్ రిలీజ్ చేయడంతో మరింత రీచ్ వచ్చిందన్నారు. దేవ్ మోహన్ మంచి వ్యక్తి.. అలాగే అద్భుతమైన నటుడని లావణ్య తెలిపారు. చిరంజీవి అందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారని.. ఆయన్ను ప్రమోషన్స్‌కి పిలిస్తే కచ్చితంగా వస్తారన్నారు. ఆయనకు ట్రైలర్ చూపించాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు.
కథ కొత్తగా, డిఫరెంట్‌గా..
ప్రస్తుతం తాను సినిమాల్ని ఒప్పుకోవడం లేదని.. కేవలం ఫ్యామిలీకే టైం కేటాయించాలని అనుకుంటున్నానని లావణ్య తెలిపారు. తన కొడుకుతోనే టైం సరిపోతుండటంతో కాస్త గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యానన్నారు. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ నరేష్, వీటీవీ గణేష్ ఇలా అందరూ అద్భుత పాత్రలు పోషించారన్నారు. కమల్ హాసన్.. ‘సతీ లీలావతి’ ఒక క్లాసిక్ చిత్రమని.. దానితో తమ చిత్రాన్ని పోల్చలేం కానీ మా సినిమా మాత్రం వినోదాత్మకంగా సాగుతుందన్నారు. వరుణ్‌తో కలిసి నటించాలని తనకు ఉందని.. ఈ మధ్యే ఓ కథ కూడా వచ్చిందన్నారు. కానీ తాము రియల్ లైఫ్‌లో కలిసే ఉన్నాం కాబట్టి.. తెరపైనా అలానే కనిపించాలంటే కథ కాస్త కొత్తగా, డిఫరెంట్‌గా ఉండాలన్నారు. భవిష్యత్తులో అలాంటి కథ వచ్చినప్పుడు ఆలోచిస్తామని లావణ్య త్రిపాఠి తెలిపారు.