Entertainment

Peddi: ‘పెద్ది ఆ రేంజ్‌లో ఉంటుందా? అవినాష్ కొల్లా చెప్పిన షాకింగ్ విషయాలు..

‘పెద్ది’ కథ ఏ స్థాయిలో ఉండబోతోంది? సినిమాపై అంచనాలైతే భారీగానే ఉన్నాయి కానీ ఆ అంచనాలను రీచ్ అవుతుందా? అంటే ఆ సినిమా ప్రొడక్షన డిజైనర్ అవినాష్ కొల్లా చెప్పిన మాటలు వింటే మాత్రం అంచనాలకు ఏమాత్రం తీసిపోదనే అనిపిస్తోంది.

Peddi: ‘పెద్ది ఆ రేంజ్‌లో ఉంటుందా? అవినాష్ కొల్లా చెప్పిన షాకింగ్ విషయాలు..

‘పెద్ది’ కథ ఏ స్థాయిలో ఉండబోతోంది? సినిమాపై అంచనాలైతే భారీగానే ఉన్నాయి కానీ ఆ అంచనాలను రీచ్ అవుతుందా? అంటే ఆ సినిమా ప్రొడక్షన డిజైనర్ అవినాష్ కొల్లా చెప్పిన మాటలు వింటే మాత్రం అంచనాలకు ఏమాత్రం తీసిపోదనే అనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ఈ చిత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందనిపిస్తోంది. సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన తనకు తొలిసారిగా కథ చెప్పినప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం ఓ రేంజ్‌లో ఎక్సైట్ అయ్యానని ఆయన వెల్లడించారు. 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయానని అవినాష్ కొల్లా సినిమా గురించి షాకింగ్ వషయాలను వెల్లడించారు. సినిమా జూన్ 4న విడుదల కానుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే అవినాష్ కొల్లా విలేకరులతో ముచ్చటించారు.

అన్నీ రీక్రియేట్ చేశాం..

కథలో బలం ఉందట. అందుకే అవినాష్ ప్రొడక్షన్ డిజైన్ పరంగా అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకోవాలని కథ విన్నప్పుడే డిసైడ్ అయ్యారట. ఈ సినిమాకు చాలా నేచురల్‌గా సెట్స్ వేశామని.. ఆడియన్స్ అది సెట్ అని గుర్తించను కూడా లేరన్నారు. ఇది ఇది 70-80లలో జరిగే కథ అని.. ఇదివరకే చాలా పీరియడ్ సినిమాలు చేసిన అనుభవం తనకు ఉందన్నారు. ‘పెద్ది’ విజయనగరం ఏరియాలో జరిగే కథ అని... అక్కడి వీధులు, క్లాక్ టవర్ ఇవన్నీ కూడా రీ క్రియేట్ చేసినట్టుగా అవినాష్ తెలిపారు. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా డిజైన్ చేశామని.. అలాగే కుస్తీ, క్రికెట్ ఆటల విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నట్టుగ వెల్లడించారు. ఇప్పటి వరకూ ఎవరూ చూడని కుస్తీ సెటప్ ఈ చిత్రంలో వేసినట్టుగా అవినాష్ తెలిపారు. దానికోసం అండర్‌గ్రౌండ్ సెటప్‌లో షూట్ చేశామని... ముఖ్యంగా చరణ్ గదతో కనిపించిన షాట్ అక్కడే చేసినట్టుగా వెల్లడించారు.

అది పసిగట్టలేరు..

ఈ సినిమా మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు మన ఊర్లో పొలాల గట్ల మీద కూర్చుని క్రికెట్ చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అంత నేచురల్ ఫీలింగ్ క్యారీ అవుతుందని అవినాష్ పేర్కొన్నారు. ఈ సినిమాకి ఏడాదికి పైనే ప్రి ప్రొడక్షన్ చేశామని.. ఆ సమయంలోనే సినిమాలోని ప్రతి సెట్‌కు సంబంధించిన మినియేచర్స్ క్రియేట్ చేసుకున్నామన్నారు. లాగే సెట్స్ అన్నీ ఓపెన్ గ్రౌండ్‌లోనే వేసి.. నేచురల్ లైట్‌లోనే తీశామన్నారు. సినిమాలో భాగంగా ఒక హిల్ స్టేషన్ ఊరు కావాల్సి రావడంతో దానిని హైదరాబాద్‌లోని ఒక బూత్ బంగ్లాలో వేశామన్నారు. సినిమా చూస్తున్నప్పుడు అది ఒక కొండ కింద ఉన్న ఊరిలా అనిపిస్తుందని.. ఆ సెట్ వేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందన్నారు. సినిమాలో చెరుకు ఫ్యాక్టరీతో సహా అన్నీ సెట్ అన్నారు. అయితే సినిమా చూసే ప్రేక్షకులు ఏ ఒక్కటీ సెట్ అనేది పసిగట్టలేరని.. అదే ఇందులో బ్యూటీ అని అవినాష్ పేర్కొన్నారు.

గాయం ఎలా అయ్యిందంటే..

స్క్రాచ్ నుంచి వేసిన సెట్స్ 24 ఉంటాయని.. అలా కాకుండా సెటప్స్ అయితే దాదాపు 60-70 పైగానే ఉంటాయని అవినాష్ తెలిపారు. చిన్న సినిమా అయితే మనం ఎక్కడికైనా వెళ్లి షూట్ చేసుకోవచ్చు కానీ ఇంత పెద్ద స్టార్ కాస్ట్‌తో వెళ్లి షూట్ చేయడం అనేది చాలా కష్టమన్నారు. లోకేషన్స్ మన కంఫర్ట్‌లో పెట్టుకుంటేనే షూట్ చేయగలుగుతామని అవినాష్ తెలిపారు. విజయనగరం సెట్ వేసి దాదాపు ఏడాది అవుతోందని.. ఎప్పుడు కావాలిస్తే అప్పుడు షూట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ వాడే బ్యాట్ కూడా చాలా నేచురల్ ప్రొడక్షన్ డిజైన్ నుంచి వచ్చిందన్నారు. తాను రూపొందించిన ట్రైన్ నుంచి స్పెషల్ సాంగ్, కుస్తీ సెట్ వరకూ అన్నీ రామ్ చరణ్‌కు చాలా నచ్చాయన్నారు. చాలా నేచురల్‌గా ఉన్నాయని ప్రశంసిచారట. రామ్ చరణ్‌కు యాక్షన్ సీక్వెన్స్‌లో కుస్తీలో భాగంగా ఆయనకు గాయమైందని అవినాష్ తెలిపారు. అయినా కూడా వెంటనే వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నారన్నారు. ఫైనల్‌గా పెద్ది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ అని.. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయన్నారు. ‘పెద్ది’ జర్నీతో అంతలా ట్రావెల్ అవుతారు. కచ్చితంగా ఆ ఎమోషన్ అయితే ఉంటుందన్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 7, 2026 8:40 AM