Faria Abdullah: ‘గాయపడ్డ సింహం’ కథ చాలా క్రేజీ..
తను ఏదైనా కథ విన్నప్పుడు నచ్చితే తప్పకుండా చేస్తానని.. ఈ సినిమా కథ చాలా క్రేజీగానూ.. వినగానే కొత్తగా అనిపించిందని ఫరియా తెలిపింది. తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే ఆయన చాలా సరదాగా ఉంటారని.. ఆయన కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని వెల్లడించింది.
తరుణ్ భాస్కర్, కశ్యప్ శ్రీనివాస్ కాంబోలో రూపొందిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించగా.. హీరో శ్రీవిష్ణు, జేడీ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరులతో ముచ్చటించింది. ఈ సినిమాలో శాలిని అనే ఒక మంచి పాత్రలో నటిస్తున్నానని ఫరియా తెలిపింది. తను ఒక వ్లాగర్ అని.. తరుణ్‌తో లవ్ ట్రాక్ ఉంటుందని వెల్లడించింది. తన పాత్రను డైరెక్టర్ కశ్యప్ డిఫరెంట్‌గా డిజైన్ చేశారని తెలిపింది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మల్టిపుల్ లేయర్స్‌లో జరిగే కథ ఇదని ఫరియా తెలిపింది. ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంటుందని.. తన క్యారెక్టర్‌లో కామెడీ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. తను ఏదైనా కథ విన్నప్పుడు నచ్చితే తప్పకుండా చేస్తానని.. ఈ సినిమా కథ చాలా క్రేజీగానూ.. వినగానే కొత్తగా అనిపించిందని ఫరియా తెలిపింది. తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే ఆయన చాలా సరదాగా ఉంటారని.. ఆయన కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని వెల్లడించింది. ఆయనతో సీన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని.. ముఖ్యంగా తరుణ్ చిన్న ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా తనకు నవ్వు వచ్చేస్తుందని తెలిపింది. సినిమా ఫైనల్ అవుట్‌పుట్ చూశానని.. చాలా అద్భుతంగా వచ్చిందని.. ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం ఉందని ఫరియా పేర్కొంది.
శ్రీ విష్ణు విషయానికి వస్తే.. ఈ చిత్రంలో ప్రతి క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని ఫరియా తెలిపింది. ఆ పాత్రను చాలా బాగా డిజైన్ చేశానని.. ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారన్నారు. ఈ చిత్రంలో మానస తరుణ్‌కు హ్యాండ్ ఇస్తుందని.. తాను హ్యాండ్ పట్టుకున్న అమ్మాయినని నవ్వుతూ చెప్పింది. కశ్యప్ కామెడీ టైమింగ్ చాలా పెక్యులర్‌గా ఉంటుందని.. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను కలిపి హిలేరియస్‌గా తెరకెక్కించారని తెలిపింది. ఆయన ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా చేశారని.. ఆయన యాక్టింగ్, డైరెక్షన్ రెండూ అద్భుతంగా ఉన్నాయని పేర్కొంది. నలుగురు నిర్మాతలతో పని చేయడం చాలా ఆనందంగా అనిపించిందని.. అంతా చాలా క్రియేటివ్‌గా ఆలోచించేవారని తెలిపింది. మంచి టీమ్ ఎఫర్ట్ ఈ సినిమాలో కనిపిస్తుందని పేర్కొంది. నెక్ట్స్ తను నటించిన ‘భగవంతుడు’ రాబోతోందని... అలాగే ‘సిగ్మా’ చేస్తున్నానని పేర్కొంది.