Entertainment Breaking News

Godari Gattupaina: అందమైన ప్రేమకథగా.. ‘గోదారి గట్టుపైన'

రాజు అనే ఆటో డ్రైవర్‌కు అతని ఆటోలో ప్రయాణించే అమ్మాయి మాయకి మధ్య సాగే మధురమైన ప్రేమ కథ ఇది. మాయ తండ్రి వీరి ప్రేమకు అడ్డంకులు సృష్టిస్తాడు. ఈ ప్రేమకథను సుభాష్ చంద్ర ఆసక్తికరంగా మలిచారు.

Godari Gattupaina: అందమైన ప్రేమకథగా.. ‘గోదారి గట్టుపైన'

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రొమాన్స్, కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఆహ్లాదకరమైన రూరల్ డ్రామా 'గోదారి గట్టుపైన'. నూతన దర్శకుడు సుభాష్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్ కథానాయికగా నటించింది. జగపతి బాబు ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రాజు అనే ఆటో డ్రైవర్‌కు అతని ఆటోలో ప్రయాణించే అమ్మాయి మాయకి మధ్య సాగే మధురమైన ప్రేమ కథ ఇది. మాయ తండ్రి వీరి ప్రేమకు అడ్డంకులు సృష్టిస్తాడు. ఈ ప్రేమకథను సుభాష్ చంద్ర ఆసక్తికరంగా మలిచారు. ప్రేమ కథతో పాటు, తండ్రి-కూతురు భావోద్వేగం చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. తాను నటించిన ‘ఫేమస్’ సినిమాకు ప్రేక్షకులు ఎంతో సపోర్ట్ ఇచ్చారని.. ఈ సినిమాకి కూడా అలాగే ఆదరణ ఇవ్వాలని కోరుకుంటున్నానన్నాడు. తాను పుట్టి పెరిగింది తెలంగాణ అని.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా గోదారి యాస నేర్చుకుని మాట్లాడానని సుమంత్ ప్రభాస్ పేర్కొన్నాడు. ప్రతి డైలాగ్‌ను సహజంగా చెప్పడానికి ప్రయత్నించానని.. ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందన్నాడు. నిధి కూడా చాలా చక్కగా తెలుగు నేర్చుకుని మాట్లాడిందని తెలిపాడు.

డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. తరాలు మారినా ప్రేమ మాత్రం మారదని.. ఇందులో ప్రేమికుల ప్రేమతో పాటు తండ్రి-కూతురు ప్రేమను చూపించామని తెలిపారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడి ముఖంలో చిరునవ్వు ఉంటుందని పేర్కొన్నారు. మా ‘గోదారి గట్టుపైన’ ఈ వేసవిలో ఒక చలివేంద్రం లాంటిదని... తన మొదటి సినిమానే అయినా గొప్ప ఆర్టిస్టులతో పని చేసే అవకాశం దొరికిందన్నారు. జగపతిబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, హర్షవర్ధన్ అందరూ అద్భుతంగా నటించారన్నారు.

ప్రొడ్యూసర్ అభినవ్ రావు మాట్లాడుతూ.. సుభాష్ చాలా అద్భుతంగా సినిమా తీశాడని తెలిపారు. అవుట్‌పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నానని... సుమంత్ కూడా అద్భుతంగా నటించాడన్నారు. చివరి 40 నిమిషాలు చాలా భావోద్వేగంగా ఉంటాయన్నారు. హీరోయిన్ నిధి ప్రదీప్ మాట్లాడుతూ.. ఈ సినిమా తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవమని.. ‘మాయ’ పాత్ర అందరికీ నచ్చుతుందన్నారు. జగపతిబాబు, లైలా, సుమంత్‌తో పని చేయడం చాలా ఆనందంగా అనిపించిందన్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. థియేటర్‌లో ఏసీ లేకపోయినా ఈ సినిమా చుస్తున్నప్పుడు చల్లగా అనిపిస్తుందన్నారు. ట్రైలర్ చాలా బాగుందని.. సుభాష్ మంచి పాత్ర ఇచ్చారన్నారు. దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. సుభాష్ భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేస్తాడని.. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు అవసరమన్నారు. గోదావరి ప్రాంతంలో షూటింగ్ చేసిన అనుభవం చాలా ప్రత్యేకమన్నారు.

రాజ్‌కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశామని.. చూసిన తర్వాత మీకు గుర్తుండిపోతుందన్నారు. సుదర్శన్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూస్తే ఒక గ్రామానికి వెళ్లిన ఫీలింగ్ వస్తుందని... జ్ఞాపకాలు గుర్తుకొస్తాయన్నాడు. ఇందులోని క్యారెక్టర్స్ మీ ఫ్రెండ్స్‌లా అనిపిస్తారని.. కామెడీ, ఎమోషన్ అన్నీ మీకు బాగా కనెక్ట్ అవుతాయన్నాడు. సుభాష్ చాలా కష్టపడ్డాడని... నిధి అచ్చమైన తెలుగు అమ్మాయిలా నటించిందన్నారు. సుమంత్ నటనతో పాటు ప్రమోషన్స్‌లో కూడా ఎంతో కేర్ తీసుకున్నాడని సుదర్శన్ పేర్కొన్నాడు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 27, 2026 4:07 PM