రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న వరలక్ష్మి, నవీన్ చంద్రల 'పోలీస్ కంప్లైంట్'..
ఆ పాత్ర.. ఈ పాత్ర అన్న తేడా లేకుండా నటనతో స్క్రీన్‌పై మ్యాజిక్ చేచసే నటి వరలక్ష్మి శరత్ కుమార్. మరోవైపు విభిన్న కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘పోలీస్ కంప్లైంట్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఆ పాత్ర.. ఈ పాత్ర అన్న తేడా లేకుండా నటనతో స్క్రీన్‌పై మ్యాజిక్ చేచసే నటి వరలక్ష్మి శరత్ కుమార్. మరోవైపు విభిన్న కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘పోలీస్ కంప్లైంట్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సంజీవ్ మేగోటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కృష్ణసాయి నటించారు. ఆయన బర్త్ డే సందర్భంగా తన అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర క్రేజీ కాంబినేషన్ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. 'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు వెల్లడించారు. ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని.. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందించబోతున్నట్టుగా తెలిపారు. ఈ సినిమా కథ, పాత్రల నిర్మాణం ప్రత్యేకంగా ఉంటూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ఇక ఈ చిత్ర డైరెక్టర్ సంజీవ్ మేగోటి విషయానికి వస్తే.. అఘోర, పౌరుషం, ఆప్త, దండు, రాఘవరెడ్డి, ఆదిపర్వం.. వంటి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో విభిన్నమైన కథా నేపథ్యం, బలమైన నటీనటుల సమాహారం, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందుతున్న ‘పోలీస్ కంప్లైంట్’ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
.