Satish Kumar: చాలా స్ట్రాంగ్, ఎమోషనల్ కంటెంట్‌తో ‘కర’
ధనుష్‌కి మంచి మార్కెట్ ఉందని.. ‘కర’లోనూ మంచి కంటెంట్ ఉందన్నారు. ఈ మూవీ గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతోనే తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ‘కుబేర’ మంచి విజయం సాధించిందని.. కానీ
ధనుష్, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ద్వారా తెలుగులో విడుదల కానుంది. ఈ క్రమంలోనే విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ అధినేత సీహెచ్ సతీష్ కుమార్ మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. విశాఖపట్నానికి చెందిన తాను చిన్న సినిమాలను కొంటూ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించానని.. ఆ తరువాత ఒక మూవీని సైతం నిర్మించినట్టుగా తెలిపారు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబాలి’, ‘సింగం 3’, ‘సలార్’, ‘కాంతారా చాప్టర్ 1’ వంటి సినిమాల్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూషన్ చేసినట్టుగా సతీష్ తెలిపారు. ధనుష్ నటించిన ‘ధర్మయోగి’ సినిమాని సైతం తెలుగులో రిలీజ్ చేసినట్టు వెల్లడించారు.
ధనుష్‌కి మంచి మార్కెట్ ఉందని.. ‘కర’లోనూ మంచి కంటెంట్ ఉందన్నారు. ఈ మూవీ గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతోనే తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ‘కుబేర’ మంచి విజయం సాధించిందని.. కానీ ఆ తరువాత వచ్చిన ‘ఇడ్లీకొట్టు’ని తెలుగులో సరిగ్గా ప్రమోట్ చేయలేదనిపిస్తోందని సతీష్ పేర్కొన్నారు.
ధనుష్ సినిమా అంటే చాలా మంది పోటీ పడతారని.. కానీ తాను పర్సనల్ కేర్ తీసుకుని నిర్మాత గణేష్‌ని అప్రోచ్ అయ్యానని తెలిపారు. తన ప్రయత్నం చూసి ఈ చిత్రాన్ని తనకు ఇచ్చారని.. ఇప్పటికే 80 శాతం బిజినెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిందన్నారు. ఓ సాధారణ మనిషికి ఎదురయ్యే సమస్యలతో చాలా స్ట్రాంగ్, ఎమోషనల్ కంటెంట్‌తో ‘కర’ రాబోతోందని పేర్కొన్నారు. తాను ఇంకా తెలుగు వర్షెన్‌ను చూడలేదన్నారు. దాదాపుగా ఎవ్వరూ కూడా సినిమాని అలా ముందే చూపించరని పేర్కొన్నారు.
ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరికి సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినట్టుగా సతీష్ కుమార్ తెలిపారు. తాను ఉత్తరాంధ్ర ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు వెల్లడించారు. దాదాపు 400కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నామని.. హిందీ వర్షెన్‌తో కలిపితే 600కి పైగా స్క్రీన్లలో వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సినిమా కరస్వామి అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందుకే తెలుగులో ‘కర’ అనే టైటిల్‌ను పెట్టారు. ‘పోరు తొళిల్’ తనకు ఎంతో ఇష్టమైన సినిమా అని... విఘ్నేశ్ మేకింగ్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ఆయన మీద తనకు చాలా నమ్మకం ఉందన్నారు. ‘కర’లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉన్నాయని... ఇది పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ధనుష్ ఉన్నారన్నారు. లోకల్ విలేజ్ అని కాకుండా ఇంటర్నేషనల్ రిలేటెడ్ కంటెంట్ కూడా ఉంటుందని సతీష్ కుమార్ పేర్కొన్నారు.